25.7 C
Hyderabad
May 22, 2024 08: 24 AM
Slider ఆదిలాబాద్

బాసర గంగపుత్రుల ఆధ్వర్యంలో గురుపౌర్ణమి

#Basara Gangaputra

జ్ఞాన సరస్వతి బాసర క్షేత్రం లోని వ్యాస భగవానుడి దేవాలయంలో గంగపుత్ర చైతన్య సమితి ఆధ్వర్యంలో బెస్త గూండ్ల ల వ్యాస పూర్ణిమ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పూస సత్యనారాయణ బెస్త మాట్లాడుతూ, “మానవాళికి చతుర్వేదాలను, మహాభారతాన్ని అందించిన, పరాశర మహర్షి- బెస్త కన్య మత్స్యగ్రంధి ల పుత్రుడు, విశ్వగురువు అయిన గంగపుత్ర జాతి మూల పురుషుడు శ్రీ శ్రీ శ్రీ వేదవ్యాసుడు అని ఆయన తెలిపారు.

ఆ వ్యాస భగవానుడు స్థాపించిన బాసర పుణ్యక్షేత్రం గర్భగుడి ముఖద్వారంను ప్రతిరోజు తెరిచే సదవకాశాన్ని సంప్రదాయ మత్స్యకారులైన బెస్త గూండ్లలకు ఇవ్వాలని MLA విఠల్ రెడ్డి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. MLA ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని సానుకూలంగా స్పందించారు.” అని ఆయన అన్నారు.

బాసర గంగపుత్ర సంఘం సభ్యులు మోహన్ గంగపుత్ర  ఓడన్న, గంగపుత్ర మహిళల ఆధ్వర్యంలో చల్లని వల పందిరి ప్రదర్శించారు. మహిళలు మంగళ హారతులతో నీరాజనాలు, గోదావరికు హారతులు ఇచ్చారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అధితులుగా ముధోల్ MLA విఠల్ రెడ్డి , భజన మండలి అధ్యక్షులు పూస నర్సింహా బెస్త హాజరయ్యారు.

ఇంకా,  చైతన్య సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అల్గోట్ రమేష్ గంగపుత్ర, ప్రధాన కార్యదర్శి శంకర్ గంగపుత్ర, అధికార ప్రతినిధి బెస్త సురేష్, ముఖ్య సలహాదారు లు నర్సయ్య బెస్త,  శ్రీనివాస్ బెస్త , దీపక్ బెస్త, బెస్త నర్సింగ్, బెస్త రమేష్,  నిజామాబాద్ నుండి బాలన్న గంగపుత్ర, నారాయణ గంగపుత్ర నిర్మల్ నుండి మోహన్ గంగపుత్ర, విజయ్ గంగపుత్ర తదితరులు పాల్గొన్నారు.

Related posts

బ్యారక్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయండి

Satyam NEWS

అంబేద్కర్ చేసిన పోరాటం వెలకట్టలేనిది: కంచర్ల కాశయ్య

Satyam NEWS

మురికి నీటితో నిండిపోతున్న నాగావళి నది

Satyam NEWS

Leave a Comment