40.2 C
Hyderabad
May 6, 2024 16: 53 PM
Slider జాతీయం

Another calamity: మిడతల దాడి బెడద దేశాన్ని వదల్లేదు

#Locust attack

సోమాలియా దేశం నుంచి మిడతల దండు భారత-పాక్ సరిహద్దుల్లోని ప్రాంతాలకు వలస వచ్చే అవకాశమున్నందున 6 రాష్ట్రాలను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ నేడు అప్రమత్తం చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో మిడతలు దాడి చేసేందుకు అవకాశం ఉందని కేంద్రం అంచనా వేసింది.

మిడతల దాడిలో పంటలు నష్టపోకుండా మిడతల నియంత్రణకు మిడత సర్కిల్ కార్యాలయాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖ ఆదేశించింది. ఆఫ్రికా నుంచి వచ్చే మిడతల దండు మన దేశంలోని 6 రాష్ట్రాల్లో తీవ్ర మైన పంటనష్టం కలిగించే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయశాఖ కూడా హెచ్చరించింది.

జైసల్మేర్, బార్మెర్, జోద్ పూర్, నాగౌర్, సికార్, జైపూర్, రాజస్ధాన్ లోని అల్వార్, మధ్యప్రదేశ్ లోని టికామ్  ప్రాంతాల్లో మిడతలు ప్రవేశించాయి.

Related posts

జై కిసాన్ కు విలువేది?: వినూత్న నిరసన తెలిపిన CITU

Satyam NEWS

వైసీపీ ఎమ్మెల్యే దూషణలతో మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

కియా మోటార్స్ ఫ్యాక్టరీలో కరోనా కలకలం

Satyam NEWS

Leave a Comment