27.7 C
Hyderabad
May 21, 2024 02: 01 AM
Slider ప్రత్యేకం

పోస్టల్ బ్యాలెట్ కు మళ్లీ అవకాశం కల్పించాలి

#postalballot

ఎన్నికల విధులకు నిర్వహిస్తున్న ఉద్యోగులకు కల్పించబడిన పోస్టల్ బ్యాలెట్ ని ఉద్యోగులందరూ సాంకేతిక కారణాల వలన పోస్టల్ బ్యాలెట్ లభ్యత లేని కారణాలవల్ల వినియోగించుకోలేదని, పనిచేసే చోట ఓటు హక్కు ఉన్నచోట జిల్లాలకి పదే పదే తిరిగినా కూడా ఉద్యోగులకు బ్యాలెట్ సౌకర్యం దక్కలేదని, అనేక వేల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం లేక ఓటు హక్కు నమోదు చేసుకోలేదని, అటువంటి వారి కోసం 13వ తారీకు తర్వాత వారందరికీ ఒక స్పెషల్ డ్రైవ్ గా పోస్టల్ బ్యాలెట్ వేసుకునే సౌకర్యాన్ని కలిగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు KV శివారెడ్డి మరియు రాష్ట్ర సంఘం ప్రతినిధులు వినతి పత్రాన్ని అందజేశారు.

14 వ తారీకు స్పెషల్ క్యాజువల్

ఎన్నికల విధులను ఉద్యోగులకి 13వ తారీకు స్పెషల్ క్యాజువల్ ఇవ్వు సౌకర్యాన్ని కలిగించారని, కానీ వేరువేరు ప్రాంతాల్లో ఎన్నికలు చేస్తున్న ఉద్యోగులు 13వ తారీఖున ఎన్నికలు ముగించుకుని మొత్తం సామాగ్రిని చేరవేసి సంబంధిత కార్యక్రమాన్ని ముగించుకునేసరికి 14 వ తారీకు అవుతుందని 14 వ తారీకు అధికారులు ఏ పరిస్థితుల్లోనూ వివిధ జిల్లాల్లో ఉన్న తమ ఆఫీసులకు హాజరైయే పరిస్థితి లేదనీ, అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని 14వ తారీకు ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ సౌకర్యం కలిగించాలని ప్రధాని ఎన్నికల అధికారిని కోరారు.

మెడికల్ డిపార్ట్మెంట్ మరియు ఇతర డిపార్ట్మెంట్ ఉద్యోగులకు రెమ్యునరేషన్

మెడికల్ డిపార్ట్మెంట్ మరియు ఇతర డిపార్ట్మెంట్ ఉద్యోగుల్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ కి అంబులెన్స్ సర్వీసెస్ కి ఫస్ట్ ఎయిడ్ సర్వీసెస్ కి ఎన్నికల విధులకు సంబంధించిన బాధ్యతలు చెప్పారని, మిగిలిన సిబ్బందితో పాటు వారికి కూడా ఎన్నికల విధులకు సంబంధించిన రెమ్యూనరేషన్ ని చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు KV శివారెడ్డి తో పాటు ఎన్జీవో నాయకులు ఏ విద్యాసాగర్, P.నాగభూషణం, రంగారావు, రంజిత్ నాయుడు తదితరులు ఉన్నారు.

Related posts

రక్తదానం చేసి ఒక తల్లిని కాపాడిన జర్నలిస్టు

Satyam NEWS

కరోనాతో ఒకే రోజు నలుగురు జర్నలిస్టుల మృతి

Satyam NEWS

నిజామాబాద్ అభివృద్ధికి సత్వర చర్యలు

Satyam NEWS

Leave a Comment