26.7 C
Hyderabad
May 21, 2024 08: 47 AM
Slider విజయనగరం

ఎస్పీ దీపికా సమక్షంలో గోడు చెప్పుకున్న బాధితులు..!

#spandana

29 మంది సమస్యలు తెలుసుకున్న పోలీస్ శాఖ..!

ప్రతీ వారం మాదిరి గానే ఈ వారం కూడా విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు “స్పందన” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఎం. దీపిక నిర్వహించారు. ప్రజల నుండి జిల్లా ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడి, వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. “స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ 29 ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

భోగాపురం మండలం గుడివాడకు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు గూడెపువలసలో సర్వే నం. 154/2 లో 0.30 సెంట్లు భూమి కలదని, సదరు భూమిని ఆక్రమించేందుకు కొంతమంది వ్యక్తులు ప్రయత్నించగా, సివిల్ కోర్టుకు వెళ్ళినట్లు, వివాదం కోర్టులో పెండింగులో ఉండగా, సదరు వ్యక్తులు అక్రమంగా భూమిలోకి ప్రవేసించినట్లు, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, న్యాయం చేయాలని భోగాపురం సీఐను ఆదేశించారు.

విజయనగరం కమ్మవీధికి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తాను వై.ఎస్.ఆర్. నగర్లో ప్లాట్ నం. 563ను 4 లక్షలు చెల్లించి గాజులరేగ ప్రాంతంకు చెందిన వ్యక్తి వద్ద నుండి కొనుగోలు చేసినట్లు, కానీ, సదరు వ్యక్తి అమ్మిన ప్లాట్ను తనకు అప్పజెప్పకుండా దౌర్జన్యంకు పాల్పడుతున్నాడని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని టూటౌన్ సీఐను ఆదేశించారు.

ఎస్.కోట మండలం ఐతన్నపాలెంకు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తాను, తన అక్క కుమారుడు ఎస్.కోటకు చెందిన ఒక వ్యక్తి వద్ద పాత చిట్టీలు కట్టినట్లు, తన అక్క కుమారుడు అవసరాల నిమిత్తం కేవలం మూడు వాయిదాలు చెల్లించి, చిట్టీ పాడుకున్నట్లు, తరువాత అతను వాయిదాలు చెల్లించకపోవడంతో తనకు రావలిసిన మొత్తాన్ని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, న్యాయం చేయాలని ఎస్. కోటసీఐను ఆదేశించారు.

గజపతినగరంకు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదుచేస్తూ తాను ఒక బొలోరే వాహనంను కొనుగోలు చేసి, సదరు వాహనాన్ని ఒక ప్రైవేటు కంపెనీకి నెలకు 37 వేలుకు లీజుకు ఇచ్చినట్లు, వాహనం డ్రైవరుకు 12 వేలు జీతం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు, కానీ సదరు డ్రైవరు తనకు ప్రతీ నెల రావలసిన మొత్తాన్ని తన అకౌంట్కు మార్పు చేసుకొని, మోసగించినట్లు, ఈ విషయమై అడుగగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరమైన చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని గజపతినగరం సీఐను ఆదేశించారు.

గజపతినగరంకు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ బెంగుళూరుకు చెందిన వ్యక్తి తనకు పైపు లైను వర్సులో పెట్టుబడి పెడితే, తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి, తనతో 58 లక్షలు పెట్టుబడి పెట్టించి, వర్కర్స్కు జీతాలు కూడా ఇంకా బిల్లులు అవ్వలేదని, నాతోనే చెల్లింపజేసి, పెట్టుబడి పెట్టిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేసారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని గజపతి నగరం సీఐను ఆదేశించారు.

విజయనగరం కు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తాను బంగారం కొనుగోలు చేసే నిమిత్తం, నగరంలోని ఒక జ్యూవలరీ షాపు యజమానికి 3.20 లక్షలు చెల్లించినట్లు, కానీ, సదరు వ్యక్తి తన డబ్బులు తిరిగి ఇవ్వడంగాని, బంగారం గాని ఇవ్వలేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని వన్ టౌన్ సీఐ సిఐను ఆదేశించారు.

ఈవిధంగా “స్పందన”లో వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, వారం రోజుల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను తనకు నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎం. దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, విజయనగరం దిశ డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, డీసీఆర్బీ సీఐ జె. మురళి, డీసీఆర్పీ ఎస్ఐలు వాసుదేవ్, ప్రభావతి మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ట్రాజెడీ: కదిరి పున్నమి పండుగలో పెను విషాదం

Satyam NEWS

పూజా కార్యక్రమాలతో ‘రైస్ మిల్’ మూవీ ప్రారంభం

Satyam NEWS

రాజంపేటలో క్లోరైడ్ ద్రావణం పిచ్చి కారి చేసిన అకేపాటి

Satyam NEWS

Leave a Comment