25.7 C
Hyderabad
May 22, 2024 07: 33 AM
Slider మహబూబ్ నగర్

9 ఏళ్లకే దశాబ్ది ఉత్సవాలా?

#kagiti

తొమ్మిదేళ్లకే దశాబ్ది ఉత్సవాలు ఏంటని కాయతి విజయ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో గురువారం అమరవీరుల స్తూపం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కల్వకుర్తి  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాయితి విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ దశాబ్ది అంటే 10 అని రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలే గడిచిందని కాయతి విజయకుమార్ రెడ్డి కెసిఆర్ కు చురకలంటించారు.

తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలని బోంధపెట్టి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అమరవీరులను, ఉద్యమకారులను మరిచి ఉద్యమ ద్రోహులైన వారికి పెద్ద పీట వేసినందుకా ఈ దశాబ్ది ఉత్సవాలు అని దుయ్యబట్టారు. దళిత బంధు పేరుతో ఆ పార్టీ నాయకులే దండుకున్నారు తప్పితే లబ్ది పొందిన వారు లేరని సొంత పార్టీ నాయకులకే దళిత బంధు ఇచ్చారని మండిపడ్డారు.

ఎన్నికలు రాబోతున్నందున ప్రజల్లో టిఆర్ఎస్ పార్టీకి తీవ్ర వ్యతిరేకత ఏర్పడడంతో అన్ని జిమ్మిక్కులు చేస్తున్నారు తప్పితే కెసిఆర్ ను ప్రజలు ఎవ్వరు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన తెలిపారు. రుణమాఫీ లక్ష ఉద్యోగాలు నిరుద్యోగ భృతి ఇస్తానని ప్రజలను మభ్యపెడుతూ మోసం చేశారని కుటుంబ పాలనతో రాష్ట్రం అతలాకుతం అవుతుందని నియంత దొరల పనిచేస్తూ పేదవారిని పట్టించుకోకుండా  ఘోరాతి ఘోరంగా పరిపాలన కొనసాగించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇక్కడి డబ్బును వేరే రాష్ట్రాలకు తరలిస్తూ దేశ రాజకీయాలంటూ పబ్బం గడుపుతూ ప్రజల దృష్టిని మళ్లించడానికి మళ్లీ అధికారం చేజిక్కించుకోవడానికి అధికార దాహంతో

ప్రజల రక్తంతో దాహార్తి తీర్చుకోవడానికి మందు తాగుతూ మందుకు ప్రజలను  బానిసలగా చేయడానికి కెసిఆర్ తీవ్రంగా కృషి  చేస్తున్నాడని  దుయ్యబట్టారు.కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అంటూ గప్పాలు కొడుతూ గొప్పలు చెప్పుకుంటూ కమిషన్లతో కాంట్రాక్టర్లు చేసుకుంటున్నాడని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడని తీవ్ర విమర్శలు చేశారు.రానున్న ఎన్నికల్లో కర్ణాటక మాదిరిగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని భవిష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి ఉపాధ్యక్షులు సైదులు యాదవ్ గణేష్ యాదవ్ నాని యాదవ్ అనిల్ హరీఫ్ శివ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున SS96 మాస్కులు పంపిణీ

Satyam NEWS

అగ్నిపత్ ను విరమించుకోవాలి: మాజీ ఎమ్మెల్యే గంగారాం

Satyam NEWS

గిరిజన హాస్టల్ లో గర్భం దాల్చిన ముగ్గురు విద్యార్థినులు

Satyam NEWS

Leave a Comment