27.7 C
Hyderabad
May 22, 2024 03: 31 AM
Slider

ప్రతి పేదవానికి సొంత ఇల్లు

#Minister Puvwada Ajay

ప్రతి పేదవారికి సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గృహలక్ష్మి పథకం క్రింద మూడు లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందచేయడం జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. ఖమ్మం నగరం భక్తరామదాసు కళాక్షేత్రంలో లబ్ధిదారులకు జి.ఓ.58, 59, గృహలక్ష్మి మంజూరు ఉత్వర్వులను మంత్రి అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద వారికి సొంతింటి కళను సాకారం చేసుందకు అర్హులైన ప్రతి పేదవారికి ఇళ్ళ పట్టాలను పంపిణీ చేయడంతో పాటు ఇంటి స్థలం కలిగిన పేదలకు గృహలక్ష్మి పథకం క్రింద ఇళ్లునిర్మించుకునే బృహత్తర కార్యక్రామానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు.గృహలక్ష్మి పథకం క్రింద స్వంత స్థలం కలిగి ఇళ్లు నిర్మించుకునేందుకు జిల్లాలో 15 వేల 5 వందల మందికి లబ్ధి చేకూరనుంది.

నియోజకవర్గానికి 3 వేల మందిని ఎంపిక చేయడం జరిగిందని ఇంటి నిర్మాణానికి 3 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం పునాది లెవల్‌లో లక్ష రూపాయలు, స్లాబ్‌ లెవల్‌లో లక్ష, నిర్మాణం పూర్తయిన తరువాత లక్ష రూపాయలు మూడు విడతలుగా అందించడం జరుగుతుంది.

ఇది నిలవ నీడలేని నిరుపేదలకు ఇది గొప్ప అవకాశమని, మంజూరు ఉత్వర్వులు అందిన వెంటనే నిర్మాణాలు చేపట్టాలని మంత్రి లబ్ధిదారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జి.ఓ.58 పథకం క్రింద ఎలాంటి ఆదెరువు లేని నిరుపేదలు 2014 నుండి 2020 నాటికి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని, ఇళ్ల్లు నిర్మించుకున్న వారి దరఖాస్తులు, సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలించి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం వారి ఇంటిపై వారికి పూర్తి హక్కు కల్పించాలనే సంకల్పంతో పూర్తి పారదర్శకతతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్హులైన లబ్ధిదారులకు మొదటి, రెండువ విడతలలో పట్టాలను అందించడం జరుగుతుందన్నారు.

Related posts

ఎట్రాషియస్: కిరాణా వ్యాపారి దారుణ హత్య

Satyam NEWS

యోగి ఆదిత్యనాథ్ కు అయోధ్యలో ఆలయం

Satyam NEWS

కరోనా కట్టడికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక కోచ్ లు

Satyam NEWS

Leave a Comment