29.7 C
Hyderabad
May 6, 2024 06: 35 AM
Slider ఖమ్మం

పట్టణాలకు దీటుగా మండలం అభివృద్ధి

#Minister Puvwada

పట్టణాలకు ధీటుగా రఘునాథపాలెం మందలాన్ని అభివృద్ధి పర్చడం జరిగిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. రఘునాథపాలెం మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సర్కార్‌ లోనే రఘునాథపాలెం మండలం సమగ్రాభివృద్ధిని సాదించిందని మంత్రి పేర్కొన్నారు.

శివాయిగూడెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్‌ లైటింగ్‌, సీసీ రోడ్లను మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ గత పాలకుల హయాంలో గ్రామాల అభివృద్దికి రూ.10 లక్షలు కూడా నిధులు వచ్చేవి కాదన్నారు.

కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతి గ్రామానికి రూ. కోట్ల నిధులు వెచ్చిస్తున్నారన్నారు. శివాయిగూడెం చిన్న గ్రామ పంచాయితీ ఐనప్పటికీ నాలుగేళ్లలోనే రెండు కోట్ల పైచిలుకు పలు అభివృద్ధి పనుల నిమిత్తం కేటాయించినట్లు తెలియజేశారు. అంతేకాక పల్లెలను పట్టణాలకు ధీటుగా సౌకర్యాలను సమకూర్చడమే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమన్నారు.

గతంలో గ్రామాల్లో కరెంటు ఎప్పుడు పోతుందో, పోతో మళ్లీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి అన్నారు. ఈ పరిస్థితి తెలంగాణ సర్కార్లో పునావృతం కాకూదనే ఉద్దేశంతో అవసరమైన చోట సబ్‌ స్టేషన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. గ్రామాల్లో కోతల్లేని విద్యుత్ను అందించడంతో పాటు మిరుమిట్లు గొలిపే కాంతిని అందిచాలని గ్రామగ్రామాన హైమాస్ట్‌ లైట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అంతేకాక పల్లెల్లో పారిశుద్య సమస్య, డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరచడం, రోడ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు.

Related posts

రియల్ ఎస్టేట్ వాళ్లకు రైతుబంధు ఇస్తున్న కేసీఆర్

Satyam NEWS

ఆర్‌జే‌డి లో ఎల్‌జే‌డి విలీనం

Sub Editor 2

వై ఎస్ జగన్ రాజకీయ వలలో చిక్కుకున్న వకీల్ సాబ్

Satyam NEWS

Leave a Comment