27.7 C
Hyderabad
May 22, 2024 03: 19 AM
Slider ప్రత్యేకం

31 వరకూ తెలంగాణలో జనతా కర్ఫ్యూ కొనసాగింపు

kcr ktr

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ గొప్పగా కొనసాగిందని ఎవరూ ఇళ్ల నుండి బయటకు రాకుండా కర్ఫ్యూ పాటించారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రగతి భవన్ లో నేటి సాయంత్రం ఆయన మీడియా సమావేశం లో మాట్లాడారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అద్భుతంగా పాటించారని ఆయన అన్నారు. ప్రధాని మోడీ చెప్పినట్లు చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారని, తనతో పాటు తన కుటుంబ సభ్యులు ఇతర మంత్రులు, అధికారులు చప్పట్లు కొట్టి సంఘీభావం తెలియజేశారని ఆయన అన్నారు.

ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు అభినందనలు తెలువుతున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. ఈ రోజు కూడా మరో 5 గురికి వైరస్ వచ్చిందని, మొత్తం కరోనా కేసులు 26 కు చేరాయని అన్నారు. వీరంతా కూడా ఇతర దేశాల నుండి వచ్చిన వారేని ఆయన అన్నారు.

ఇవాళ్టి నుండి అన్ని అంతర్జాతీయ విమానాలు బంద్ అయిపోతున్నాయని ఇప్పటి వరకు ఇతర దేశాల నుండి వచ్చేవారిని అందరిని క్వారన్ టైన్ లోకి పంపించామని ఆయన తెలిపారు. ఇవాళ్టి లాగానే ఈనెల 31వ తేదీ వరకు కర్ఫ్యూ కొనసాగించాలి అని అంటున్నాం అందరూ దీన్ని పాటించాలి దయచేసి అని కేసీఆర్ తెలిపారు.

ఏపీడమిస్ డిసిస్ యాక్ట్ అమలు చేస్తున్నాం, ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశాం. మార్చ్ 31 వ తేదీ వరకు ఎవరు కూడా బయటకు రావద్దు. ఎవరు కూడా గుమికుడొద్దు అని ఆయన కోరారు. ఈ యాక్ట్ ప్రకారం 5 గురు కంటే ఎక్కువ మంది ఒక్కదగ్గర ఉండకూడదు.

నిత్యావసర వస్తువుల విషయంలో కుటుంబం లో ఒక్కరికి అనుమతి ఉంటుందని ఆయన తెలిపారు. రేషన్ కార్డ్ ఉన్న ఒక్క వ్యక్తి 12 కేజీల బియ్యం అందజేస్తాం, దీనికి సంబంధించి సీఎస్ ఉత్తర్వులు కూడా ఇస్తారు. 3లక్షల 36 వేల టన్నుల బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తాం.

ప్రతి రేషన్ కార్డ్ కు 15 వందల నగదు ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు కూడా అందరూ డ్యూటీ కి రావాల్సిన పని లేదు. అత్యవసర పరిస్థితి ఉన్న ఉద్యోగులు మాత్రమే డ్యూటీ కి రావాలి. పేపర్ వాల్యువేషన్ చేసేవారికి కూడా రిలీవ్ చేస్తున్నాం.

1897 యాక్ట్ ప్రకారం బిల్డింగ్, ఇతర ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, కూలీలకు, ప్రభుత్వం, యజమాని చెల్లించాలి. లాక్ డౌన్ కాలంలో ఆయా సంస్థలు ఉద్యోగులకు వారం రోజుల డబ్బులు చెల్లించాలి. అంగన్ వాడి కేంద్రాలు క్లోజ్ చేసి వారికి మాత్రమే అందించే ప్రయత్నం చేస్తున్నాం. గర్భిణీ స్త్రీలు ఎవరెవరు ఉన్నారో లిస్ట్ తయ్యార్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర సరిహద్దు లు క్లోజ్ చేస్తున్నాం, తెలంగాణ కోసం వచ్చే వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తాం. ప్రైవేట్ బస్ లు కూడా బంద్ చేస్తున్నామని ఆయన తెలిపారు.

Related posts

వాలంటీర్లు సరే… వీళ్లు చేస్తున్నది ఏమిటి?

Satyam NEWS

హైకోర్టు తరలింపునకు వ్యతిరేకంగా అవనిగడ్డలో దీక్షలు

Satyam NEWS

ఎన్ కౌంటర్ లో మావోయిస్టు మృతి

Bhavani

Leave a Comment