34.7 C
Hyderabad
May 5, 2024 01: 29 AM
Slider పశ్చిమగోదావరి

వాలంటీర్లు సరే… వీళ్లు చేస్తున్నది ఏమిటి?

#eluru

ఇప్పటి వరకూ వాలంటీర్లు వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని దాన్ని సంఘ విద్రోహులకు అందచేస్తున్నారని అందువల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయనే ఆరోపణలు విన్నాం. అంతకన్నా పెద్ద నేరం చేసే ప్రభుత్వ ఉద్యోగుల కథ వింటే ఒళ్లు గగుర్పొచడకమానదు. ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేస్తారంటే భూముల మ్యుటేషన్ లు, అడంగల్ కరెక్షన్, అసైన్డ్ భూముల మార్పిడి చేస్తుంటారు.

ఇది ఎంత కీలకమైన పనో చెప్పగానే అర్ధం అయి ఉంటుంది. ఈ పనులు చేయడానికి లక్షల్లో లంచాలు తీసుకుంటారు. ఎంతో కీలకమైన ఈ వ్యక్తులతో అధికార వైసీపీ నేతలు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఎంతో సఖ్యతతో ఉంటారు. ఎందుకంటే వారు అంత కీలకమైన ప్రభుత్వ ఉద్యోగులన్నమాట. ఏలూరు జిల్లాలో మెట్ట ప్రాంతానికి చెందిన ఒక మండలం లో పనిచేసే ఇరువురు ఉద్యోగుల కథ ఇది.  పగలు వై సి పి నాయకులతో, రాత్రిపూట టి డి పి నాయకులతో టచ్ లో ఉంటూ బతకనేర్చిన బహుమేధావి ఉద్యోగులుగా చలామణి ఔతున్నవీరు ఇప్పటికే చాలా ప్రభుత్వ భూములు హాం ఫట్ చేసినట్లు సమాచారం.

అధికార ప్రతిపక్ష ముఖ్యనేతలను, మండల స్థాయి అధికారులతో పాటు కొంత మంది జిల్లా స్థాయి అధికారులు ఈ ఇరువురు ఉద్యోగులు బుట్టలో వేసుకున్నారు. జిల్లా స్థాయి అధికారులు కూడా వీరికి ప్రాధాన్యత ఇస్తారని సమాచారం. ఈ ఉద్యోగుల్లో ఒకాయన తనకనుకూలమైన తన బంధువులను బినామిలుగా పెట్టుకుని ఆ మండలం లో సుమారు 4 నుండి 5 ఎకరాల ఎసైన్డ్ భూములు పొందాదాని సమాచారం.

ఈ ఇరువురు ఉద్యోగులు జూదక్రీడల్లో కూడా దిట్టలని తెలిసింది. విధులకు హాజరై తమ కార్యాలయాలలో బయోమెట్రిక్ హాజరు ఇచ్చేసి ఆ ప్రాంతంలో ఉన్న  గెస్ట్ హౌస్ లలో నిర్వహించే పేకాట ఆడతారనే విమర్శలు ఉన్నాయి. ఎందుకు వీరికి ఇంత ప్రాధాన్యత అంటే వీరు కొంత మంది అధికారులకు, కొంతమంది రాజకీయ నాయకులకు ఆదాయ వనరులు చూపిస్తుంటారు. అందువల్ల ఉద్యోగాలకు కొన్ని సమయాలలో డుమ్మా కొట్టి గెస్ట్ హౌసుల్లో నిర్వహించే పేకాటలకు నిర్భయంగా వెళ్లిపోతుంటారట.

రాజకీయ పార్టీల గెలుపోటములపై లక్షల్లో బెట్టింగ్ లు కూడా కట్టి లక్షలాది రూపాయలు గెలుపొందారని కొంత మంది రాజకీయ ప్రముఖులు చెప్పుకుంటున్నట్టు సమాచారం. ఇలా గెలుపొందిన లక్షల్లో కొంత భాగం తమకిష్టమైన రాజకీయ పార్టీ నాయకుని కి పార్టీ ఫండ్ గా కూడా ఇచ్చి ఈ ఇరువురు తనవాళ్లే నని ఆ నాయకుడు అనుకునేలా వ్యవహరిస్తారని సమాచారం.

రాజకీయ నాయకుల చెప్పు చేతల్లో విధులు నిర్వహిస్తున్న వీరు కోట్లకు పడగలెత్తిపోయారని అత్యంత విశ్వసనీయ సమాచారం. కొంత మంది నాయకులు వీరిని దూరప్రాంతాలకు విహార వినోద, విలాస యాత్రలకు కూడా తమ ఖర్చుతోనే తీసుకెళతారని తెలిసింది. ఇప్పటికే విహార కేంద్రం పేరుతో ఉన్న ఒక రాష్ట్రానికి వెళ్లి కొద్దిరోజులు ఎంజాయ్ చేసి వచ్చినట్టు సమాచారం. మరో  కొద్దిరోజుల్లో మరో సంపన్న దేశ పర్యటనకు కూడా వెళ్లబోతున్నారని సమాచారం.

అందుకు సంబంధించి పత్రాలు కూడా సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఇంట్లోవాళ్ళకే ఆరోగ్యం బాగోలేదని సెలవు పెట్టుకోవడానికి ఒక పట్టాన అనుమతినివ్వని అధికారులు ఉద్యోగాలు వదిలి వినోద విహార యాత్రలు విలాసాలకు వెళ్లేందుకు ఆ ఇరువురి ఉద్యోగులకు ఎలా సెలవులు మంజూరు చేస్తున్నారని ఆ మండలం లో పనిచేసే సాటి ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు.

Related posts

హుజూరాబాద్ లో నూతన పశు వైద్యశాల  భవనానికి శంఖుస్థాపన

Satyam NEWS

చౌడవాడ ఘటన పునరావృతం కాకుండా చూడండి..

Satyam NEWS

చైత్ర హత్య ఘటనపై బహుజన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం

Satyam NEWS

Leave a Comment