26.7 C
Hyderabad
May 21, 2024 09: 24 AM
Slider కృష్ణ

ఛీటర్లకు సీటిస్తే మద్దతు ఇవ్వను

#MP Keshineni Nani

ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తిరిగే హక్కు ఉంది చార్లెస్ సోబ్రాజ్, దావుద్ ఇబ్రహీం సెక్స్ రాకెట్, కాల్ మని చేసేవాళ్ళు కూడా పోటీ చేసే హక్కు ఉంది అని ఎంపీ కేశినేని నాని అన్నారు. నెట్టం రఘురామ్, మహాత్మా గాంధీ లాంటి మంచి వారికి సీటు ఇవచ్చు, దావుద్ ఇబ్రహీం లాంటి వారిని, లాండ్ బ్రాబర్లు, ఉమెనైజర్లకు కి ఇవ్వొచ్చు‌…ఎన్టీఆర్ గొప్ప ఆశయం తో టీడీపీ స్థాపించారు ఆ ఆశయంతో పనిచేయాలని ఉంటే చేయొచ్చు….

కాదని ఇలాంటి వారికి సీటు ఇచ్చి పార్టీ సిద్ధాంతాన్ని పక్కదారి పట్టించాలంటే సీట్లు ఇవ్వొచ్చు….. అయితే కేశినేని చిన్నే కాదు, మరో ముగ్గురు వ్యక్తులు టికెట్ ఇస్తే నా మద్దతు ఉండదు అని ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. తాను ఢీల్లీ స్థాయి నాయకుడిని తన సేవలు పార్టీ ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చునని కేశినేని నాని అన్నారు. తాను ఎంపీ అయితేనే ఈ స్థాయి రాలేదని తనకు ఒక బ్రాండ్ ఉందని, ఎంపీ కాకపోతే టాటా ట్రస్ట్ లాంటివి తెచ్చి సేవ చేస్తానేమోనని కేశినేని నాని అన్నారు. కేశినేని చిన్ని కి పార్టీ లో సీటు ఇస్తే చచ్చినా ముద్దతు ఇవ్వను అని ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు.

క్యారెక్టర్ ఉన్న పేదవాడికైనా సీటు ఇస్తే ఎంపీనే కాదు ఏదైనా చేస్తా ….. కానీ చీటర్స్, లాండ్ మాఫీయా డాన్ లకి,రియల్ ఎస్టేట్, మోసాలు చేసే వారికి, పేకాట క్లబ్ లు నడిపే వాళ్ళ కి మద్దతు ఇవ్వను అని కేశినేని నాని స్పష్టం చేశారు. నాకో క్లారిటీ ఉంది కరప్షన్ కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు నేను జీవితంలో ఎవరిని మోసం చేయలేదు అని కేశినేని నాని వెల్లడించారు. టీడీపీ ప్రక్షాళన కావాలన్నది తన కోరిక అని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు.

Related posts

డిజిపి గౌతమ్ సవాంగ్ ఐపిఎస్సా లేక వైపిఎస్సా ?

Satyam NEWS

పట్టభద్రుల ఎమ్మెల్సీకి ములుగు జిల్లా జాగృతి శుభాకాంక్షలు

Satyam NEWS

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో ధన్వంతరి హోమం

Satyam NEWS

Leave a Comment