31.2 C
Hyderabad
February 14, 2025 19: 27 PM
Slider ఆదిలాబాద్

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో ధన్వంతరి హోమం

basara homam

కరోనా వైరస్ అదుపులేకుండా వ్యాప్తి చెందుతూ ప్రపంచ వ్యాప్తంగా ఎందరి ప్రాణాలనో హరిస్తున్నందున ఉపశమనం కోసం నిర్మల్ జిల్లా బాసరలోని  శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం లో వేదపండితులు ధన్వంతరి, మృత్యుంజయ, సుదర్శన మూలమంత్ర హోమం నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అమ్మవారి సన్నిధి లో ఈ హోమం చేపట్టినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు తెలిపారు. దేశంలో, రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో నివసించే బ్రాహ్మణాది సకల జనులు, సమస్త పశు పక్షి జాతులు సమస్త జీవరాశులకు కరోనా విషజ్వర వ్యాధి పీడ దరిచేరకుండా ఉండాలని హోమం సందర్భంగా అర్చకులు సంకల్పం చెప్పుకున్నారు.

కరోనా వ్యాధితో బాధపడుతున్న వారికి నివృత్తి జరిగి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలనే కాంక్షతో ఈ రోజు రెండవ రోజు అమ్మవారి సన్నిధిలో ఆలయ  ప్రధానార్చకులు, ఆలయ పూజారులు, వేదపండితుల చే ధన్వంతరి, మృత్యుంజయ, సుదర్శన మూలమంత్ర హోమం నిర్వహించామని వారు తెలిపారు.

Related posts

వైసీపీ ఎమ్మెల్యే విచ్చలవిడితనం వల్లే ఏపీలో కరోనా

Satyam NEWS

[Professional] Should Zytenze Male Enhancement Be Taken With Viagra Does Any Male Enhancement Really Work Instarect Male Enhancement

mamatha

వివేకా హత్య కేసులో నాలుగో రోజు సీబీఐ విచారణ

Satyam NEWS

Leave a Comment