26.7 C
Hyderabad
May 21, 2024 08: 08 AM
Slider జాతీయం

అధునాతన ఫీచర్లతో ఐటీ శాఖ వెబ్సైట్

#incometax

ఆదాయపు పన్ను శాఖ తన ప్రధాన పోర్టల్ ని కొత్త ఫీచర్లతో పునరుద్ధరించింది. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్, అధునాతన ఫీచర్ల లో దీన్ని తీసుకొచ్చింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) చైర్మన్ నితిన్ గుప్తా దీన్ని శనివారం ప్రారంభించారు. పన్ను చెల్లింపు దారులకు మెరుగైన అనుభవాన్ని అందించంతో పాటు, కొత్త టెక్నాలజీ తో ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్ ( www.incometaxindia.gov.in ) ను పునరుద్ధరించినట్లు సీబీడీటీ ఓ ప్రకటనలో పేర్కొంది. పునరుద్ధరించిన వెబ్సైట్ మొబైల్ రెస్పాన్సివ్ గా ఉంటుంది. కంటెంట్ కోసం మెగా మెనూ ను అందించారు. ఆదాయపు పన్నుకు సంబంధించి వేర్వేరు చట్టాలు, సెక్షన్లు, నియమాలు, పన్ను ఒప్పందాలు వంటివి సులువైన నావిగేషన్ ద్వారా యూజర్లు పొందొచ్చు. రివర్స్ కౌంట్ డౌన్ కూడిన ముఖ్యమైన తేదీల అలర్ట్ లు, టూల్ టిప్స్, ఆదాయపు పన్ను శాఖకు చెందిన అనుబంధ పోర్టల్ ల లింక్స్ అందుబాటులో ఉంటాయి.

Related posts

అంబర్ పేట్ లో బస్తీలో బిఆర్ఎస్ కార్యక్రమం

Satyam NEWS

విద్యారంగంలో చంద్రబాబు విజన్‌… దేశంలోనే నెంబర్‌ వన్‌..!!

Satyam NEWS

మునిసిపల్ కార్మికులకు పులిహోర ప్యాకెట్ల పంపిణీ

Satyam NEWS

Leave a Comment