37.2 C
Hyderabad
May 2, 2024 12: 25 PM
Slider కరీంనగర్

కేసీఆర్ ఓటమితో బీఆర్ఎస్ భూస్థాపితం

#minister Shabbir Ali

కామారెడ్డి, గజ్వేల్ లో కేసీఆర్ ఓటమితో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కానుందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు.ఈ సందర్బంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ప్రజా యుద్ధనౌక గద్దర్ పాత్ర కీలకమని, అలాంటి వ్యక్తి తొమ్మిదిన్నరేళ్ల పాటు ప్రగతి భవన్ గేటు కూడా కెసిఆర్ దాటనివ్వలేదన్నారు.

కేసీఆర్ ను గద్దె దించాలన్న గద్దర్ చివరి కోరికను తీరుస్తామన్నారు. హైదరాబాద్, గజ్వేల్ లో కేసీఆర్ భూములు అమ్మేసారని, ఇప్పుడు కామారెడ్డిలో ఉన్న భూములను అమ్మడానికి వస్తున్నారన్నారు. గజ్వేల్ లో ఎకరానికి 9, 10 లక్షలిచ్చి భూములు తీసుకున్న కేసీఆర్ ఆ భూములను కోట్లకు అమ్ముకున్నారన్నారు. కామారెడ్డిలో కూడా బీఆర్ఎస్ ల్యాండ్ మాఫియా దిగుతుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

నేనేం పీకానని కేటీఆర్ మాట్లాడుతున్నాడని, తాను ఏం పీకానో మీ అయ్యను అడగాలని కేటీఆర్ కు సూచించారు. తెలంగాణపై ప్రకటన వచ్చేలా చూడాలని కేసీఆర్ వేడుకుంటే సోనియాగాంధీతో మాట్లాడి ఒప్పించి అర్ధరాత్రి ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ దీక్ష విరమించానని గుర్తు చేశారు. డబుల్ ఇళ్ల నిర్మాణంలో పైనుంచి కేసీఆర్ కు కమిషన, కిందనుంచి ఎమ్మెల్యేకు కమిషన్ వెళ్తుందన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబంలో ఒక్కరైనా ఆత్మహత్య చేసుకున్నారా..?

ఒక్కరైనా జైలుకు వెళ్ళారా..? అని ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబానికి గతంలో ఇల్లు కూడా లేదని, ఇప్పుడేమో లక్షల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు. లిక్కర్ షాపులను కేసీఆర్ పెడితే లిక్కర్ ఏజన్సీకి కవిత రాణి అయిందన్నారు. శ్రీకాంత చారి మరణం చూసి సోనియాగాంధీ చలించిపోయారని, తెలంగాణలో ఇంకా ఒక్కరి ప్రాణం కూడా పోవద్దని అందరి నోళ్లు మూయించి పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ చేయించారని తెలిపారు.

అలాంటి శ్రీకాంత చారి తల్లికి కేసీఆర్ ఇచ్చిన గౌరవం ఎలాంటిదో ప్రజలు చూసారన్నారు. కామారెడ్డిలో కౌరవులు, పాండవుల మధ్య యుద్ధం జరుగబోతుందని, కౌరవులు వందల మంది దాడికి వస్తారని బీఆర్ఎస్ నేతలనుద్దేశించి అన్నారు. తెలంగాణ భవిష్యత్తు మన చేతిలోనే ఉందని, కామారెడ్డి, గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడించి రాష్ట్రాన్ని కాపాడాలని ప్రజలను కోరారు.

తన జీవిత కాలంలో కామారెడ్డికి తాగునీరు, సాగునీరు అందించాలన్న రెండు కోరికలు ఉండేవని, అందులో 240 కోట్లతో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపామన్నారు. సాగునీరు కోసం ప్రాణహిత చేవెళ్ల పథకానికి 20,21,22 ప్యాకేజి ద్వారా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సాగునీరు అందించేందుకు రెండేళ్లలో 419 కోట్లు ఖర్చు చేశామన్నారు.

తొమ్మిదిన్నరేళ్లలో కేవలం 29 కోట్లు మాత్రమే కేసీఆర్ ఖర్చు చేశారన్నారు. కొండపోచమ్మ, మల్లన్నసాగర్ మాత్రం కేసీఆర్ ఇలాకాలో నిర్మించుకున్నారన్నారు. ఈ గడ్డమీద పుట్టిన వారిని గెలిపిస్తారా.. బయటి వారిని గెలిపిస్తారా ప్రజలే ఆలోచించాలన్నారు. తాను మీ ఇంటి మనిషినని, గెలిచినా ఓడినా పుట్టిన గడ్డను వదిలి వెళ్లలేదని ఒక్కసారి తనకు అవకాశం ఇస్తే తన సత్తా ఏంటో చూపిస్తానన్నారు

కేసీఆర్ డిక్షనరీలో అభివృద్ధి లేదు కేసీఆర్ డిక్షనరీలోనే అభివృద్ధి అనే పదం ఉండదని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు నర్సారెడ్డి అన్నారు. నియోజకవర్గానికి 5 వేల ఇల్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్ గజ్వేల్ లో కేవలం 1200 ఇళ్లను మాత్రమే నిర్మించారని, అవి కూడా మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు ఇచ్చారన్నారు. 9 ఏళ్ల కింద రింగు రోడ్డు పనులు ప్రారంభించారని, ఇప్పటికి రింగు మాదిరిగానే తిరుగుతుందన్నారు.

రోడ్డు కోసం రైతుల వద్ద భూములు తీసుకున్న కేసీఆర్ ఎకరానికి 10-12 లక్షలు ఇచ్చి కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. కేసీఆర్ గజ్వేల్ కు వచ్చి రెండేళ్ళయిందని తెలిపారు. కేసీఆర్ నమ్మించి మోసం చేసారని, అలాంటి వారిని దగ్గరకు రానివద్దని కోరారు. కామారెడ్డిలో షబ్బీర్ అలీని గెలిపించి కేసీఆర్ ను ఇంటికి పంపించాలని కార్యకర్తలకు సూచించారు.

Related posts

డాక్టర్ సుధాకర్ పైనా ఎఫ్ఐర్ నమోదు చేసిన సీబీఐ

Satyam NEWS

హే భగవాన్ మా దుస్థితి పట్టించుకొనే వారు లేరా?

Satyam NEWS

వాలీబాల్ విజేత చింత‌ల‌మ‌నేప‌ల్లి జ‌ట్టు

Sub Editor

Leave a Comment