26.7 C
Hyderabad
May 21, 2024 09: 19 AM
Slider నల్గొండ

ఒంటరి మహిళ, వితంతువు పెన్షన్ పేర్లను తొలగించాలి

#lelavati

స్త్రీలపై భారతదేశంలో ఇంకా చులకన భావం ఉన్నదని, వారిని మరింత కుంగదీసే విధంగా ప్రభుత్వ పథకాలకు పేర్లు అమలవుతున్నాయని ‘విన్నపం ఒక పోరాటం’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు చీకూరి లీలావతి అన్నారు. దేశంలో కొత్త పాలకులు వచ్చిన ప్రతిసారి పథకాలు అమలు చేస్తున్నారు కానీ పథకాల పేర్లలోని అసమానతలను తొలగించడం లేదని ఆమె అన్నారు. ఒంటరి మహిళ, వితంతువు పెన్షన్ పేర్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కి, తెలంగాణ పౌర స్పందన శాఖ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మంగ కు ఆదివారం సంస్థ తరపున వినతి పత్రం అందజేశారు. హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఆసరా పెన్షన్ లలో వితంతువు, ఒంటరి మహిళ పేర్లతో వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నారని, నేటికి ఆ పేర్లను తొలగించలేదని లీలావతి అన్నారు. ఈ పేర్లను తొలగించి వితంతువు స్థానంలో చాకలి ఐలమ్మ పెన్షన్ గా, ఒంటరి మహిళ పేరును శక్తి మహిళగా మార్చాలని కోరుతూ ‘విన్నపం ఒక పోరాటం’ స్వచ్ఛంద సంస్థ ద్వారా వినతిపత్రం అందజేశామని లీలావతి అన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

నిబద్దతతో విధులు నిర్వహించాలి

Bhavani

ఇన్విటేషన్: మేడారం జాతరకు తరలి రండి

Satyam NEWS

క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని రగిలింద్దాం: శీతల రోషపతి

Satyam NEWS

Leave a Comment