39.2 C
Hyderabad
May 3, 2024 14: 50 PM
Slider హైదరాబాద్

ఘనంగా కేసీఆర్ జన్మదిన సంబరాలను నిర్వహించాలి

#kaleruvenkatesh

తెలంగాణ రాష్ట్ర ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సంబరాలను ఘనంగా నిర్వహించాలని అంబర్పేట నియోజకవర్గం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కోరారు. ఆదివారం ఆయన ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మూడు రోజులపాటు సీఎం కేసీఆర్ జన్మదిన సంబరాలు 15,16,17 తేదీల్లో సేవా కార్యక్రమాలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మూడు రోజులపాటు పార్టీ శ్రేణులు నిర్వహించాల్సిన కార్యక్రమాల వివరాలు: ఈనెల 15వ తేదీ- రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు (ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాల వంటి చోట్ల పండ్ల పంపిణీ, ఆహార పంపిణీ, దుస్తుల పంపిణీ వంటి కార్యక్రమాలు)

– 16 తేదీ – అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు

– 17 తేదీ కేసీఆర్ జన్మదినం రోజున రాష్ట్ర వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు.

ఈ మూడు రోజులపాటు ఇవే కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతి కార్యకర్త తనకు తోచిన విధంగా ఇతరులకు సహాయ పడేందుకు గిఫ్ట్ ఏ స్మైల్  కార్యక్రమంలో భాగంగా తమ తమ స్థాయిలో ఏ సేవా కార్యక్రమాన్ని అయినా చేపట్టవచ్చని కేటీఆర్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

దగ్గర రాజధాని దూరం చేసినందుకా జగన్ కు పాలాభిషేకం?

Satyam NEWS

బీసీ స్టడీ సర్కిళ్ల కోచింగ్ ఎంట్రన్స్ కోసం ఆన్లైన్ నమోదు ప్రారంభం

Satyam NEWS

ఘనంగా వేం నరేందర్ రెడ్డి కుమారుడి వివాహం

Satyam NEWS

Leave a Comment