29.7 C
Hyderabad
May 22, 2024 00: 53 AM
Slider వరంగల్

పదవ తరగతి విద్యార్థులకు 40 రోజుల కార్యాచరణ ప్రణాళిక

#muluguDEO

పదవ తరగతి వార్షిక పరీక్షలలో విద్యార్థులు అనుసరించాల్సిన “40 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక” ను రూపొందించినట్లు ములుగు డీఈఓ G. పాణిని తెలిపారు. ములుగు జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలనే  ఉద్దేశంతో DCEB ములుగు ఆధ్వర్యంలో దీన్నితయారుచేసి ముద్రించినట్లు తెలిపారు. దీన్ని ప్రతి పాఠశాలకు ఇవ్వడం జరుగుతుందని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ ప్రణాళికను అమలు చేస్తూ విద్యార్థుల స్థాయికి అనుగుణంగా  ప్రత్యేక పునశ్చరణ తరగతులను నిర్వహించాలని కోరారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కరోనా కారణంగా చాలా వరకు ప్రత్యక్ష తరగతులకు దూరమైన విద్యార్థులు ఇప్పటి నుండి ఈ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అనుసరిస్తూ, ఉపాధ్యాయుల సలహాలు సూచనల మేరకు సమయం వృధా చేయకుండా ప్రణాళికాబద్ధంగా చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. ఈ ప్రణాళిక అమలు తీరును పర్యవేక్షించవలసిందిగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, MEO లు కోఆర్డినేటర్ లను కోరడం జరిగింది

డీఈవో కార్యాలయంలో 40 రోజుల ప్రత్యేక ప్రణాళిక  ప్రతులను DEO ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీసీఈబీ కార్యదర్శి విజయమ్మ, ACGE రమేష్, డీఈఓ కార్యాలయ కోఆర్డినేటర్లు సుదర్శన్ రెడ్డి, రమాదేవి, సాంబయ్య, రాజు, ములుగు ఎంఈఓ శ్రీనివాసులు, మంగపేట ఎంఈఓ రాజేష్, DCEB సహాయ కార్యదర్శి యాసం విక్రమ్, సీనియర్ అసిస్టెంట్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

శివుని సొమ్ము దొంగలపాలు: సిద్ధవటం ఆలయంలో ఆగని చోరీలు

Satyam NEWS

పేదవాడి వైద్యం ఖర్చుకు కార్పొరేటర్ సాయం

Satyam NEWS

కచ్చితంగా ఇక నుంచి మాస్కులు ధరించాల్సిందే

Satyam NEWS

Leave a Comment