29.7 C
Hyderabad
May 1, 2024 04: 29 AM
Slider మహబూబ్ నగర్

మహిళల భద్రత కోసమే షీ టీమ్ ల ఏర్పాటు

#nagarkurnoolpolice

మహిళల భద్రత కోసమే షీ టీమ్ లు పనిచేస్తున్నాయని నాగర్ కర్నూల్ ఎస్ పి k మనోహర్ అన్నారు. స్థానిక గీతాంజలి హై స్కూల్ లో షీ టీం పై నేడు అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న ఎస్ పి మాట్లాడుతూ ఆడవారి భద్రత ముఖ్య లక్ష్యంగా షీ టీమ్ లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు చదువులతో పాటు క్రీడలపై ఆసక్తి చూపాలని ఆయన కోరారు. దేశం గర్వించే క్రీడాకారులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.

అదేవిధంగా అడిషనల్ ఎస్పీ సి హెచ్ రామేశ్వర మాట్లాడుతూ పోక్సో చట్టంపై విద్యార్థులకు ఎన్నో విలువైన విషయాలను తెలియచేశారు. 18 సంవత్సరాల లోపు బాలికలకు వివాహం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బాల్య వివాహాలు చేయకూడదని అది చట్టరీత్యా నేరమని అన్నారు. మహిళలపై వేధింపుల గురించి గానీ బాల్య వివాహాలపై గాని 7901099455 లేదా100 నెంబర్ కు సమాచారం ఇవ్వగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో గీతాంజలి స్కూల్ ప్రిన్సిపల్ రాయి జోసఫ్, ఇన్ఛార్జి  రాధ, అధ్యాపక బృందం, కళాజాత సభ్యులు  శ్రీను పాండు లు, సైబర్ కాంగ్రెస్ పి సి రవికుమార్ షీ టీం ఇంచార్జ్ లలిత ఎస్ ఐ  విజయలక్ష్మి ఏ ఎస్ ఐ సి టీం మెంబర్ వెంకటయ్య లు పాల్గొన్నారు.

Related posts

మున్నూరు కాపు సంఘం 7వ రోజు అన్నదాన కార్యక్రమం

Satyam NEWS

రఘురామకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

Satyam NEWS

మునుగోడు పోటీ కన్నా ముందు విభజన హామీలు నెరవేర్చండి

Satyam NEWS

Leave a Comment