26.7 C
Hyderabad
May 21, 2024 09: 57 AM
Slider ముఖ్యంశాలు

అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్

దేశ వ్యాప్తంగా రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని 33 సైనిక స్కూళ్లలో 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9వ తరగతిలో అడ్మిషన్స్​ కోసం కేంద్ర ప్రభుత్వం అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (ఏఐఎస్‌ఎస్‌ఈఈ–2023) నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఎన్‌జీవోలు/ ప్రైవేట్ పాఠశాలలు/ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనిచేసే 18 కొత్త సైనిక పాఠశాలలకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.

అర్హతలు: ఆరో తరగతికి ప్రవేశం పొందే విద్యార్థుల వయసు మార్చి 31, 2023 నాటికి 10- నుంచి12 ఏళ్ల మధ్యలో ఉండాలి. బాలికలు ఆరో తరగతిలో అడ్మిషన్స్​కు దరఖాస్తు చేసుకోవచ్చు. తొమ్మిదో తరగతిలో ప్రవేశం పొందే విద్యార్థుల వయసు మార్చి 31, 2023 నాటికి 13- నుంచి 15 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

సెలెక్షన్​: అభ్యర్థులు ప్రవేశపరీక్షలో ఒక్కో సబ్జెక్టులో కనిష్టంగా 25% మార్కులు, అన్ని సజ్జెక్టుల్లో కలిపి 40% మార్కులు సాధించాలి. దీనిలో అర్హత సాధించిన వారికి శారీరక దారుఢ్య, వైద్య పరీక్షలు నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు.

ఎగ్జామ్​ ప్యాటర్న్​: పెన్ పేపర్ (ఓఎంఆర్‌ షీట్‌) విధానంలో నిర్వహించే రాత పరీక్షలో సాధించే మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

ఆరో తరగతిలోకి ప్రవేశం పొందే విద్యార్థులకు మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 125 ప్రశ్నలు ఇస్తారు. మ్యాథ్స్​ సబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు. ఇంటెలిజెన్స్, లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టుల నుంచి 25 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. ఎగ్జామ్​ డ్యురేషన్​ 2.30 గంటలు ఉంటుంది.

తొమ్మిదో తరగతిలో చేరే విద్యార్థులు 400 మార్కులకు పరీక్ష రాయాలి. మ్యాథమెటిక్స్ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు. ఇంటెలిజెన్స్, ఇంగ్లిష్, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్ సబ్జెక్టుల నుంచి 25 ప్రశ్నల చొప్పున 100 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. మూడు గంటల సమయం ఇస్తారు.

దరఖాస్తులు: అర్హత కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో అక్టోబరు 21, 2022 నుంచి నవంబర్‌ 30, 2022 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులు రూ.500, ఇతరులు రూ.650 ఎగ్జామ్​ ఫీజు చెల్లించాలి. జనవరి 8, 2023న ఎంట్రన్స్​ ఎగ్జామ్​ నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.aissee.nta.nic.in వెబ్​సైట్​ సంప్రదించాలి.

Related posts

నిత్యావసరాల ధరల పెంపును నిరసిస్తూ కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు

Satyam NEWS

యాజిటేషన్: పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వరా?

Satyam NEWS

శ్రీ సాయి కృష్ణ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా డాక్టర్ వర్కుటి

Satyam NEWS

Leave a Comment