28.2 C
Hyderabad
May 17, 2024 12: 04 PM
Slider ఖమ్మం

కౌలు రైతులు సమస్యలు పట్టని ప్రభుత్వాలు

#formersunion

అకాల వర్షాలు, ఎర్రనల్లి, తామర పురుగు వల్ల  లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు నష్టపోయిన కౌలు రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవడంలో విఫలమయ్యాయని తెలంగాణ రాష్ట్ర  కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పోజ్ సూర్యనారాయణ ఆరోపించారు. ఖమ్మం లో అడప రామకోటయ్య అధ్యక్షతన  జరిగిన కౌలు రైతుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులు తిరిగి రబి పంటకు పెట్టుబడి లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రబి పంటకు విత్తనాలు, ఎరువులు ప్రభుత్వం నుండి ఉచితంగా రైతులకు అందజేసి రైతులను ఆదుకోవాలని  ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. బ్యాంకు రుణాలు, రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ కౌలు రైతులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు అడపా రామకోటయ్య, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు దొండపాటి రమేష్, కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జక్కుల రామారావు, బి రమేష్, వెంకటేశ్వర్లు, సీతారాములు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎక్సోడస్: పరిపాలనా బాధ్యతలు విశాఖపట్నం నుంచే

Satyam NEWS

కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

Bhavani

కాచిగూడ రైల్వే అండర్ బ్రిడ్జి రోడ్డు నిర్మాణానికి మోక్షం

Satyam NEWS

Leave a Comment