26.7 C
Hyderabad
May 3, 2024 09: 47 AM
Slider ఆంధ్రప్రదేశ్

యాజిటేషన్: పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వరా?

#Save Amaravathi

అమరావతి గ్రామాలలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న కార్మికులపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శనివారం నాడు రాజధానిలోని ఎర్రబాలెం గ్రామంలో భౌతిక దూరం పాటిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు.

మొత్తం 29 గ్రామాలలో పారిశుద్ధ్య పని చేసిన కార్మికులకు నాలుగు నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదని సిఐటియు తెలిపింది. కరోనా నుంచి రక్షణకు మాస్కులు, గ్లౌజులు కూడా ఇవ్వకుండా పని చేయించారని సిఐటియు రాజధాని డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు యం రవి ఎం భాగ్య రాజు అన్నారు.

కరోనా వైరస్ వల్ల ప్రజలందరూ ఇళ్ల కే పరిమితమైన సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వీధుల్లోకి వచ్చి పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారని అలాంటి కార్మికుల పట్ల పాలకులు ఇంత నిర్ధాక్షణ్యంగా వ్యవహరించడం సరైంది కాదని అన్నారు. వారి ఆకలి కేకలు పట్టించుకోకపోవడం వల్ల గత్యంతరం లేని పరిస్థితిలో కార్మికులు ఈ రోజు రోడ్డున పడి భిక్షాటన చేయవలసిన దుస్థితిని పాలకులు కల్పించడం సిగ్గుచేటని అన్నారు.

ప్రైవేటు ఏజెన్సీ సి ఆర్ డి ఏ అధికారుల మధ్య సమన్వయ లోపం కార్మికుల పట్ల శాపంగా మారిందని ఆయన అన్నారు. ఫలితంగా కార్మికులు పని చేస్తున్నప్పటికీ వారి కుటుంబాలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఆర్డీఏ అధికారులు ఇప్పటికైనా మీనమేషాలు లెక్కించడం మాని తక్షణం పారిశుద్ధ్య కార్మికుల జీతాలు రక్షణ పరికరాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ ఏజెన్సీ నీ  బ్లాక్ లిస్టులో పెట్టాలని వారు డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో  ప్రజా సంఘాల మద్దతుతో ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కే సుందరయ్య యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఓ రామా రావు టి ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related posts

దుబ్బాకలో ట్రబుల్ మేకర్లను బైండోవర్ చేయండి

Satyam NEWS

లోక్ సభ డిలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం

Bhavani

సోనియా, రాహుల్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్

Bhavani

Leave a Comment