32.2 C
Hyderabad
May 21, 2024 12: 58 PM
Slider వరంగల్

ములుగు జిల్లాలో వార్షిక రుణ ప్రణాళికపై సమీక్ష

#SBIMulugu

వార్షిక రుణ ప్రణాళిక పై ములుగు జిల్లా ఏటూర్ నాగారం  మండల స్థాయి బ్యాంకింగ్ సమన్వయ సమావేశం మంగళవారం నాడు జరిగింది.

ఎంపిడివో కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయ రుణాలు, ఇతర రుణాలు, స్వయం సహాయక సంఘాల రుణాలు, చిన్నతరహా పరిశ్రమలకు ఇచ్చే రుణాలు, ముద్ర రుణాలు తదితర అంశాలపై చర్చించారు.

ఎస్ సి కార్పొరేషన్ విడుదల చేయాల్సిన రుణాలు, ITDA సంబంధిత రుణాలు గురించి కూడా సమీక్ష జరిపారు. ఎస్ సి కార్పొరేషన్ మినీ డైరీ రుణాలను 80 మంది లబ్దిదారులకు మంజూరు చేశారు.

ఇంకా 93 మంది కి మంజూరు చేయాల్సి ఉంది. ఈ సమావేశంలో ఎల్ డి ఎం ఆంజనేయులు, ఎస్ సి కార్పొరేషన్ ఇడి రవి, నాబార్డ్ డిడిఎం శేఖర్, ఎస్ బి ఐ మేనేజర్ ఏకలవ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

బీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా లకావత్ గిరిబాబు

Bhavani

విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి

Satyam NEWS

అడవుల పరిరక్షణ తోనే ప్రకృతి సమతుల్యత సాధ్యం

Satyam NEWS

Leave a Comment