38.2 C
Hyderabad
May 5, 2024 19: 24 PM
Slider ప్రత్యేకం

అడవుల పరిరక్షణ తోనే ప్రకృతి సమతుల్యత సాధ్యం

#MinisterIndrakaranreddy

ప్రకృతి మనకు అవసరమయ్యే దానికంటే మనకే ప్రకృతి అవసరమని  ప్ర‌తి ఒక్క‌రూ గ్రహించాల్సిన అవ‌స‌రం ఉందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.

అంత‌ర్జాతీయ అట‌వీ దినోత్స‌వం సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ….  ప్రకృతితో మన సంబంధాన్ని పునరాలోచించుకోవడానికి, పునః నిర్వచించటానికి ఇదే స‌రైన సమయం అని లేక‌పోతే భ‌విష్య‌త్తులో  గాలి, నీరు దొర‌క‌ని ప‌రిస్థుతుల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంద‌న్నారు.

మనల్ని మనం ర‌క్షించుకోవడానికిగాను, మనం భూగ్రహాన్ని రక్షించుకోవాలని తెలిపారు. పర్యావరణం బాగుండాలంటే గాలి, నీరు, చెట్లు సంవృద్ధిగా ఉండాల‌ని పేర్కొన్నారు.

భూమిపై కనీసం 33శాతం అటవీ ప్రాంతం ఉంటేనే ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త సాధ్య‌మ‌వుతుంద‌ని, అందుకే తెలంగాణ ప్ర‌భుత్వం ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు అధిక ప్రాధన్య‌త‌నిస్తుంద‌న్నారు. 

ప్రతి ఒక్క‌రూ తమ పుట్టిన రోజు సందర్భంగా విధిగా ఒక మొక్కను నాటి అందరికి స్పూర్తిదాయకంగా నిలవాలని ఆయన సూచించారు.

Related posts

రిక్వెస్ట్: చంద్రబాబు కుట్రలపై రాష్ట్రపతికి లేఖ

Satyam NEWS

[Over The Counter] Skinny Girl Daily Pills Reviews What Are Some Good Cheap Weight Loss Pills

Bhavani

వైసీపీ నేతల దౌర్జన్యానికి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

Leave a Comment