29.7 C
Hyderabad
May 14, 2024 01: 05 AM
Slider ముఖ్యంశాలు

విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి

#puvvada

రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టిందని, ప్రజా సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలువనుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న “ముఖ్యమంత్రి అల్పాహారం” పథకాన్ని మంత్రి స్థానిక రోటరీ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లాంఛనంగా ప్రారంభించారు.

మంత్రి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి లతో కలిసి ఈ పథకాన్ని ప్రారంభించి చిన్నారులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఇప్పటికే ఉదయం వేళల్లో రాగిజావను అందిస్తుండగా, మధ్యాహ్న భోజనాన్ని గుడ్డుతో పాటు అందిస్తున్నామన్నారు. ఈ రెండింటికి మధ్యలో ఇకపై అల్పాహారంగా కిచిడీ, పొంగల్‌, ఉప్మా వంటి వాటిని విద్యార్థులకు అందించాలని ముఖ్యమంత్రి కేసీఅర్ నిర్ణయించడం మంచి విషయం అన్నారు.

అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని అన్ని స్థాయిల విద్యార్థులకు ఈ అల్పాహారాన్ని ఇక నుండి ప్రతి రోజూ ఇవ్వనున్నామని ఆయన తెలిపారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చదివించడానికి తల్లిదండ్రులు వెనుకాడే పరిస్థితుల నుండి నేడు ఎమ్మేల్యే, స్థానిక సర్పంచ్, ఎంపిటిసి లు ఇతర ప్రజాప్రతినిధుల దగ్గరికి సిఫారసు కోసం వెళ్తున్నారని అంటే ప్రభుత్వ విద్య ఏ స్థాయికి చేరిందో అర్దం అవుతుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యం పై ప్రత్యేక దృష్టి సారించిందని అందుకు గాను బడ్జెట్ లో అధిక నిధులు విడుదల చేస్తూ విద్యా ప్రమాణాలను ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిందన్నారు. ఒకప్పుడు పాఠశాలలో రేకుల షెడ్ ల కింద వంట, దొడ్డు బియ్యంతో భోజనం, సరైన వసతులు లేక, అరకొర నిధులు, నిర్వహణ లోపం ఇలా అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడిన ఘటనలు చూశామని, కానీ నేడు ఆ పరిస్థితులను అధిగమించి ప్రతి పాఠశాలలో ప్రత్యేక కిచెన్ గదులు, నిధులు, సన్న బియ్యం అందుబాటులో ఉన్నాయన్నారు.

ప్రభుత్వం విద్య యొక్క అవశ్యకతను గుర్తించి, మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి పథకాన్ని రూపొందించి దశల వారీగా అన్ని ప్రభుత్వం పాఠశాలలో కార్పొరేట్ కు ధీటుగా అన్ని వసతులు, సౌకర్యాలను కల్పించడం జరిగిందన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, నియోజకవర్గానికి ఒక పాఠశాల చొప్పున పైలట్ ప్రాజెక్టుగా ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నట్లు, దశరా సెలవుల తర్వాత జిల్లాలోని అన్ని పాఠశాలలకు పథకాన్ని అందించనున్నట్లు తెలిపారు. నాణ్యమైన విద్యతో, పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండడానికి పౌష్టికాహారం ఇస్తున్నట్లు తెలిపారు.

భావి తరాల పిల్లలు దేశానికి ఆస్తి అని, ఆరోగ్యవంతమైన మానవ వనరులకు పౌష్టికాహారం ఎంతో అవసరమని అన్నారు. 1980 లో మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టారని, తిరిగి 50 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రవేశపెట్టినట్లు, ఇది ఒక మైలురాయి అని ఆయన తెలిపారు. 1 నుండి 10వ తరగతి పిల్లలందరికీ ఈ పథకం వర్తింపజేస్తామని, ప్రత్యేక అధికారులు పాఠశాలల్లో అల్పాహారం తీసుకొని, పర్యవేక్షణ చేయాలని అన్నారు.

Related posts

జాతీయ సాధన సర్వే మొదలయింది

Satyam NEWS

పత్తి రైతుల సమస్య పరిష్కారానికి జీఎస్టీ చైర్మన్ హామీ

Bhavani

రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ స్థల పరిశీలన

Bhavani

Leave a Comment