34.2 C
Hyderabad
May 21, 2024 22: 16 PM
Slider విజయనగరం

ఆర్మ్ రిజర్వు పోలీసుల కోసం “డీ-మొబిలైజేషన్”

#vijayanagarampolice

విజయనగరం జిల్లా పోలీసుశాఖలో విధులు నిర్వహిస్తున్న ఆర్మ్ రిజర్వు పోలీసుల వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపర్చేందుకు, 15 రోజుల “డీ-మొబిలైజేషన్” కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు. ఈ మేరకు పోలీసు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన “డీ-మొబిలైజేషన్” ముగింపు కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎం. దీపిక ముఖ్య అతిధిగా హాజరై, ఆర్మ్ పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ ఎన్నో ఒడిదుడుకులు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ, వాటిని అధిగమించి, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ఆర్మ్ రిజర్వు పోలీసుల వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపర్చేందుకు 15రోజుల పాటు “డీ మొబిలైజేషన్” కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.

ఈ మొబిలైజేషన్ కార్యక్రమంలో భాగంగా పోలీసు సిబ్బందికి శారీరక, మానసిక సామర్థ్యంను మెరుగుపర్చడంతోపాటు, వివిధ ఆయుధాల వినియోగం, ఆర్మ్స్, లాఠీడ్రిల్స్, యోగ, ముఖ్య వ్యక్తుల భద్రత, వారికి రక్షణ కల్పించడం, వివిధ బందోబస్తుల్లో పోలీసులు నిర్వహించాల్సిన విధుల్లో మెళుకువల గురించి వివరించి, ఫైరింగు ప్రాక్టీసు చేయించి, ఆర్మ్రి జర్వు పోలీసులను అన్ని విభాగాల్లోను నిష్నాతులను చేసామన్నారు.

పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని, పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రతీ శుక్రవారం ప్రత్యేకంగా “పోలీసు వెల్ఫేర్ డే” ను నిర్వహించి, చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో ప్రభుత్వం జిల్లాల పునర్విభజన కు శ్రీకారం చుట్టిందన్నారు.

ఇందులో భాగంగా జిల్లా పోలీసు సిబ్బంది, అధికారులను రెండు జిల్లాలకు విభజించడం జరిగిందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న సిబ్బంది, ఉద్యోగాలు చేసే భార్య, భర్తల సమస్యల పరిష్కారానికి చీఫ్ ఆఫీసు ఉత్తర్వులు మేరకు ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు.

తన దృష్టికి తీసుకొని వచ్చిన పోలీసు సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని సిబ్బందికి జిల్లా ఎస్పీ ఎం.దీపిక భరోసాను కల్పించారు. ఆర్మ్రి జర్వు పోలీసులు నిర్వహించిన పరేడ్ కు రిజర్వు ఇన్స్పెక్టర్ చిరంజీవి పరేడ్ కమాండర్ గా వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, విజయనగరం ఇన్చార్జ్ డీఎస్పీ టి. త్రినాధ్, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, ఆర్ఐలు చిరంజీవి, పి.నాగేశ్వరరావు, మరియన్ రాజు, టి.వి.ఆర్.కె. కుమార్, రమణమూర్తి, రూరల్సీ ఐ టివి తిరుపతిరావు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి బదిలీ

Satyam NEWS

డెల్టాతో పోల్చితే ఓమిక్రాన్‌ ప్రమాదం తక్కువే : ఏఎంఏ

Sub Editor

నేను తొలేళ్ల రోజునే అమ్మవారిని దర్శనం చేసుకుంటా…!

Satyam NEWS

Leave a Comment