26.7 C
Hyderabad
May 21, 2024 07: 18 AM
Slider ముఖ్యంశాలు

ప్రియాంక హత్యలో ఐదోవాడు లేడు

priyanka reddy

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి సామూహిక అత్యాచారం, హత్య కేసులో మరో నిందితుడు కూడా ఉన్నాడని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన అన్నారు. ప్రియాంక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

ఈ కేసులో ఈ కేసులో ఏ1 మహ్మద్ అలియాస్ ఆరిఫ్, లారీ డ్రైవర్, ఏ2 జొల్లు శివ, ఏ3 నవీన్, ఏ4గా చింతకుంట చెన్నకేశవులు ఉన్నారు. ఈ నిందితులను శనివారం మేజిస్ట్రేట్ వద్ద హాజరుపర్చి, 14 రోజులపాటు రిమాండ్‌కు విధించారు. ఈ నిందితులను షాద్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు.

ప్రియాంక హత్య కేసులో ఏ1గా ఉన్న మహ్మద్ ఆరిఫ్‌కు ఖైదీ నంబర్ 1979 కేటాయించారు. ఏ2 బొల్లి శివకు 1980, ఏ3 చెన్నకేశవులుకు 1981, ఏ4 నవీన్‌కుమార్‌కు 1982 నంబర్లు కేటాయించారు. అయితే, ప్రియాంక హత్య కేసులో ఐదుగురు నిందితులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై డీసీపీ ప్రకాశ్ రెడ్డి స్పష్టతనిచ్చారు.

కేసులో పట్టుబడిన నలుగురు నిందితులు మాత్రమే ఉన్నారని, ఐదో నిందితుడు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పస్టం చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిగేలా చూస్తామని చెప్పారు. కోర్టుకి అన్ని ఆధారాలు సమర్పించి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని డీసీపీ ప్రకాశ్ రెడ్డి వివరించారు.

Related posts

గుడ్ వర్క్: కరోనా వైరస్ పట్ల అప్రమత్తతకు ప్రచారం

Satyam NEWS

కోదండరాముని అలంకారంలో శ్రీ పద్మావతి

Sub Editor

శ్రీ స్వామి రామానంద యోగజ్ఞానాశ్రమంలో ఆది శంకరాచార్యుల జయంతి

Satyam NEWS

Leave a Comment