Slider ఆధ్యాత్మికం

కోదండరాముని అలంకారంలో శ్రీ పద్మావతి

sri padmavathi

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శనివారం రాత్రి హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.

హనుమంతుడు శ్రీరామచంద్రునికి అనన్యభక్తుడు. త్రేతాయుగంలో శ్రీవారు శ్రీరాముడిగా అవతరించారు. ఆదిలక్ష్మి సీతగా మిథిలానగరంలో అవతరించి, స్వామిని వివాహమాడింది. భూదేవి అంశ అయిన వేదవతి కలియుగంలో పద్మావతిగా అవతరించింది. తన జాడను శ్రీవారికి తెలిపిన మహాభక్తుడైన ఆంజనేయుని కోరికను తీర్చడానికా అన్నట్టు అలమేలుమంగ బ్రహ్మోత్సవాలలో హనుమంతున్నివాహనంగా చేసుకుంది.

వాహన సేవలో పెద్దజీయ‌ర్ స్వామి, చిన్నజీయ‌ర్ స్వామి, టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, అదనపు సివిఎస్వో శివకుమార్ రెడ్డి, విఎస్‌వో బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, ఏఈవో సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ మల్లీశ్వరి, ఏవిఎస్వో చిరంజీవి, విఐలు సురేష్ రెడ్డి, మహేష్, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ రాజేష్ క‌న్నాఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

మాతృ దేవత

Satyam NEWS

14న అంబేద్కర్ జయంతి నుంచి బండి రెండో దఫా ప్రజా సంగ్రామ యాత్ర

Satyam NEWS

చెరువులో భార్యాభర్త మృతదేహాలు లభ్యం

Satyam NEWS

Leave a Comment