కొమురం భీం జిల్లా లోని చింతలమానేపల్లి ఎంపీపీ శనివారం జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, వెంటనే వెనక్కి తీసుకోవాలని టీయూడబ్ల్యూజే (ఐజెయు) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా అక్కడికి చేరుకున్న పాత్రికేయులపై కార్యక్రమంలో ఉన్న ఎంపిపి అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం అన్నారు. జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ తమ సేవలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ ఎంపీపీ అందరి సమక్షంలో జర్నలిస్టులను కించపరిచే వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం బాగా లేదన్నారు. ఈ విషయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నారు.
జర్నలిస్టుల, పత్రికలపై చిన్నచూపు చూసే విధంగా మాటలు మాట్లాడడం ఏ మాత్రం సరికాదన్నారు. వెంటనే ఎంపీపీ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. లేనిపక్షంలో జిల్లా స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.