31.2 C
Hyderabad
February 14, 2025 20: 55 PM
Slider నెల్లూరు

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో లైన్ మెన్ మృతి

current shock

నెల్లూరు జిల్లా కోట మండలంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ సంస్థలో కాంట్రాక్టు లేబర్ గా పని చేస్తున్న ఒక యువకుడు కరెంటు స్థంభంపైకి ఎక్కి రిపేరు చేస్తుండగా కరెంటు సరఫరా జరిగింది. దాంతో ఒక్క సారిగా షాక్ కొట్టడంతో అతను అక్కడికక్కడే మరణించాడు.

కోట మండలం నెల్లూరు పల్లి కొత్తపాలెంలో మస్తాన్ అనే యువకుడు ఈ విధంగా విద్యుత్ షాక్ తో  స్తంభం ఎక్కి పనిచేస్తూ మరణించాడు. ఎల్సీ తీసుకున్నా కరెంటు సరఫరా కావడంతో మృతి చెందినట్లు అతని బంధువులు చెబుతున్నా తమకేమీ తెలియదని విద్యుత్ అధికారులు అంటున్నారు.

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే మస్తాన్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు.

Related posts

కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

Satyam NEWS

కరీంనగర్ లో దివ్యధామంగా టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయం

Satyam NEWS

టీడీపీ సీనియర్ నేత కళావెంకట్రావు అరెస్ట్

Satyam NEWS

Leave a Comment