Slider పశ్చిమగోదావరి

సిబ్బంది కొరత: అవినీతి మరక: పాలన పడక

#pedavegi mandal

పశ్చిమగోదావరిజిల్లా పెదవేగి మండల పరిషత్ కార్యాలయం లో అధికారుల కొరత ప్రజలకు శాపం లా మారింది. ఇక్కడ విధులు నిర్వహించే రెగ్యులర్ ఎం డి ఓ దీర్ఘ కాల సెలవులో ఉన్నారు. ఈ కార్యాలయం లో ఏ ఓ గా పనిచేసే  అధికారితో పాటు జూనియర్ అసిస్టెంట్ కూడా కోవిడ్ సెలవులో ఉన్నారు. చివరికి అటెండర్ కూడా దీర్ఘ కాలంగా సెలవులోనే ఉన్నాడు.

దీర్ఘ కాల సెలవు లో ఉన్న ఎం డి ఓ   ఇక్కడ విధులు నిర్వహించే సమయం లో రాట్నాల కుంట పంచాయతీ కి చెందిన 14వ ఆర్థిక సంఘం నిధులు సుమారు 8 లక్షల రూపాయలు నకిలీ వేలి ముద్ర వేసి స్వాహా చేసి ఏలూరు సబ్ ట్రెజరీ కార్యాలయం లో అడ్డంగా దొరికిపోయారు.

ఈ ఎం డి ఓ పై అధికారులు ఇంతవరకు  చర్యలు చేపట్టక పోవడం విశేషం. ఈ ఎం డి ఓ ని ఇరువురు అధికారులు నాలుగు గోడల మధ్య రహస్యంగా కూడా విచారణ చేపట్టినట్టు విశ్వసనీయ సమాచారం. పంచాయతీ ఎన్నికల అనంతరం ఈ అధికారి దీర్ఘ కాలిక సెలవుపై వెళ్లిపోయారు. ఆ తరువాత ఇంచార్జి ఎం డి ఓ గా ఈ ఓ పి ఆర్ డి బలరామరాజును జిల్లా అధికారులు నియమించారు.

ఈయన మండలం లో విధులలో ఉన్నప్పటికి ఎవరు ఫోన్ చేసినా స్పందించరని చాలా మందికి అనుభవం. రాట్నాల కుంట పంచాయతీ కి స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు ఈయన కు ఏవిధమైన సమాచారం ఇవ్వకుండా  ఎం డి ఓ తనకు తానే రాట్నాల కుంట స్పెషల్ ఆఫీసర్ గా నకిలీ ఆర్డర్ సృష్టించుకుని రాట్నాల కుంట పంచాయతీ లో సుమారు 8 లక్షల రూపాయలు 14వ ఆర్థిక సంఘ నిధులు నిబంధనలకు  విరుద్ధం గా స్వాహా చేసారు.

ఈ సమాచారం మీడియా ద్వారా వెలుగులోకి వచ్చేంత వరకు పంచాయతీ సొమ్ములు స్వాహా అయిన విషయం సదరు రాట్నాల కుంట  స్పెషల్ ఆఫీసర్  గా ఉన్న బలరామ రాజు  జిల్లా ఉన్నతాధికారులకు తెలియ పర్చ లేదనే విమర్శలు అప్పట్లో వెల్లు వెత్తాయి.

కార్యాలయం లో  పరిపాలనాధికారి, జూనియర్ అసిస్టెంట్  నెల రోజుల నుండి కోవిడ్  సెలవులో ఉండటం తో కార్యాలయ పరిపాలన అస్తవ్యస్తంగా తయారైంది. 4 నెలల నాడు జరిగిన   పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సుమారు 22 లక్షలు మంజూరు చేయగా సిబ్బందికి సక్రమంగా  రెన్యూమరేషన్ ఇవ్వలేదు.

ఎం పి టి సి నామినేషన్ ల సమయం లో మండల పరిషత్ జనరల్ ఫండ్ నుండి సుమారు 90 వేల రూపాయలు తిరిగి జమ చేసే పద్ధతి పై డ్రా చేసి నట్టు తెలిసింది. ఆ నిధులు పై లెక్కలు తేలాల్సి ఉందని కార్యాలయ అధికారుల సమాచారం.

పెడవేగి మండలం లో సుమారు 5 నెలలుగా మండల పరిషత్ పరిపాలన పడ కేసిందని ప్రజలు చెప్పు కుంటున్నారు.ఏ అధికారి ఎక్కడ ఉంటారో    ఎప్పుడు వస్తారో   తెలియని పరిస్థితి. ప్రస్తుతం పెదవేగి మండలంలో డిప్యూటేషన్ పై పని చేసే సీనియర్ అసిస్టెంట్, ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఒక అటెండర్ తో కార్యాలయము నడుస్తోంది.

జిల్లాలో 30 గ్రామ పంచాయితీలతో రెండవ పెద్ద మండలమైన పెదవేగి మండల కార్యాలయ  పరిపాలన ఆగమాగమైపోయిందని మండల ప్రజలు అనుకుంటున్నారు. 2018 లో మంజూరైన ఆదరణ పనిముట్లు ఇప్పటి వరకు లబ్ది దారులకు చెర కుండా తుప్పుపట్టి పోతున్నాయంటే ఈ కార్యాలయ పరిపాలన పరిస్థితి ఎంత అస్తవ్యస్తంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Related posts

వేముల వాడలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి

Satyam NEWS

స్థితప్రఙ్ఞుడు

Satyam NEWS

ధరల పెరుగుదలను నిరసిస్తూ నిరసన

Sub Editor 2

Leave a Comment