32.2 C
Hyderabad
May 21, 2024 14: 24 PM
Slider జాతీయం

ఈజిప్టు నుంచి ఉల్లిగడ్డలు భూటాన్ నుంచి ఆలుగడ్డలు

#OnionMarket

దేశంలో ఆలుగడ్డలు, ఉల్లిగడ్డల సరఫరాను మెరుగు పరచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

ఇప్పటికే దేశంలోని ప్రయివేటు వ్యాపారులు 7 వేల టన్నుల ఉల్లిగడ్డలు దిగుమతి చేసుకున్నారని మరో 25 వేల టన్నులు దీపావళి నాటికి దేశానికి చేరుకుంటుందని ఆయన తెలిపారు.

ప్రభుత్వ రంగ సంస్థ అయిన నాఫెడ్ ద్వారా కూడా ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు దిగుమతి చేసుకుంటున్నామని మంత్రి వివరించారు.

భూటాన్ నుంచి 30 వేల టన్నుల ఆలుగడ్డలను ఎలాంటి ఆంక్షలు కూడా లేకుండా దిగుమతి చేసుకుంటున్నామని పీయూష్ గోయల్ వివరించారు.

గత మూడు రోజులుగా దేశంలో రిటైల్ ఉల్లిగడ్డల ధర కిలో రూ.65 దగ్గర స్థిరంగా ఉందని ఆయన తెలిపారు.

దిగుమతులే కాకుండా వచ్చే నెలలో కొత్త పంట వస్తుందని అప్పుడు ధర మరింతగా తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు.

దేశంలోని ప్రయివేటు వ్యాపారులు ఈజిప్టు, ఆప్ఘనిస్తాన్, టర్కీ నుంచి ఉల్లిగడ్డలు దిగుమతి చేసుకుంటున్నారని మంత్రి వెల్లడించారు.

ఉల్లి విత్తనాల ఎగుమతులపై నిషేధం విధించామని మంత్రి తెలిపారు. బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ట్రేడర్ల వద్ద ఎక్కువ స్టాక్ నిల్వ ఉంచకుండా ఆదేశాలు జారీ చేశామని మంత్రి వెల్లడించారు.

గత మూడు రోజులుగా ఆలుగడ్డల ధర కిలో రూ.42 దగ్గర స్థిరంగా ఉందని ఆయన తెలిపారు.

Related posts

కరోనా లెసన్: సమస్య వారిది కాదు దేశానిది

Satyam NEWS

వృత్తి శిక్షణా తరగతులు ప్రారంభం

Bhavani

పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో భారీ చోరీ

Satyam NEWS

Leave a Comment