32.2 C
Hyderabad
May 21, 2024 13: 46 PM
Slider గుంటూరు

వైసీపీ గూండాలకు పోలీసుల సహకారం

#Yarapathineni Srinivasa Rao

పల్నాడు జిల్లా మాచర్ల లో జరిగిన సంఘటనకు పోలీసుల సహకారం కూడా ఉందని గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. మాచర్ల నియోజకవర్గ టిడిపి ఇంచార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి వెహికల్ ఒక్కదాన్ని పంపించి, మిగతావన్నీ ఆపి, ఆయన వెళ్ళిన తర్వాత ఆయన వెనుక వైసిపి వాళ్లవి 20 వెహికల్స్ పంపేలా పోలీసులు సహకరించారని ఆయన అన్నారు. బ్రహ్మారెడ్డి బయటకు వెళ్లిన తర్వాత మాచర్లలో ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసుల మీద లేదా? అని ఆయన ప్రశ్నించారు.

పార్టీ ఆఫీసు ఎలా తగలబెట్టారు? తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లు ఎలా తగలబెట్టారు? తెలుగుదేశం పార్టీ నాయకులపై ఎలా దాడి చేశారు? అంటే పోలీసులు పూర్తిగా అధికార పక్షానికి వత్తాసు పలుకుతున్నారు అని ఆయన అన్నారు. హ్మారెడ్డి కి ఏమన్నా జరిగుంటే పోలీసులే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. వీళ్ళ అరాచకాలు 2019లో అధికారం వచ్చిన తర్వాత ఇంకా పెరిగిపోయాయి. 2014 టిడిపి అధికారంలో ఉన్నప్పుడే సరస్వతి సిమెంట్స్, రైతులపై దాడి చేసి రైతుల్ని, ఎస్సీలను, మహిళా రైతుల్ని గాయపరచడం, పొలాలన్నీ ఆగం చెయ్యడం వీళ్ళ అరాచకానికి పరాకాష్ట.

ఇక అధికారం వచ్చిన తర్వాత వీళ్ళు పూర్తిగా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఇది వాళ్ళ పతనానికి నాంది అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. 1991లో రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు, వీళ్ళ బాబాయి సుందర్రామి రెడ్డి కూడా ఇదేవిధంగా ఆ రోజు మాచర్ల ఎమ్మెల్యే నిమ్మగడ్డ శివరామకృష్ణ ప్రసాద్, కెసిపి సిమెంట్ ఫ్యాక్టరీ, వడ్డే లారీ ట్రాన్స్పోర్ట్, ఇంకా దాదాపు 20, 30 ఇళ్లు, వ్యాపార వర్గాల్ని ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించిన సంగతి కూడా ఇంకా పల్నాడు ప్రజలు మర్చిపోలేదు.

అదేవిధంగా 30 సంవత్సరాల తర్వాత మరలా వీళ్ళు, ఆ కుటుంబం మరలా మాచర్లలో సేమ్ సంఘటన్ని రిపీట్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు ఎవ్వరూ ఒప్పుకోరు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. 1991లో విధ్వంసం సృష్టించిన సుందర్రామి రెడ్డి, 1994లో ఎన్నికల్లో ఓడిపోయాడు. ఈ పిన్నెల్లి సోదరుల పతనం కూడా వచ్చే ఎన్నికల్లో శాశ్వతంగా ప్రజలు భూస్థాపితం చేస్తారు. జూలకంటి బ్రహ్మారెడ్డి కుటుంబం రాజకీయంగా ఎంతో ఉన్నతమైన కుటుంబం.

వాళ్ల నాన్న సమితి ప్రెసిడెంట్ గా, నాగిరెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా, వాళ్ళ అమ్మ ఎమ్మెల్యేగా, బ్రహ్మారెడ్డి కూడా రెండుసార్లు కంటెస్టింగ్ కాండేట్ గా, ఈరోజు ఇన్చార్జిగా ఉంటే ఆయన తిరగడానికి వీల్లేదు, ఆయన రావడానికి వీళ్ళేదంటే నీ అయ్య జాగీరా మాచర్ల? ఏమన్నా, పల్నాడు మీ అయ్య జాగీరా? ఏమన్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. లేకుంటే మీకు పతనం మొదలైంది. ప్రజలు మిమ్మల్ని ఓడించి శాశ్వతంగా ఇంటికి పంపించి సమాధి కడతారు అని యరపతినేని అన్నారు.

Related posts

నూతన సంసద్ భవనం దేనికి సంకేతం?

Sub Editor

సురభి వాణీదేవి సేవాభావం కలిగిన వ్యక్తి

Satyam NEWS

INTUC ఆధ్వర్యంలో ఘనంగా కార్మికుల పండుగ

Satyam NEWS

Leave a Comment