38.2 C
Hyderabad
May 5, 2024 21: 01 PM
Slider నల్గొండ

INTUC ఆధ్వర్యంలో ఘనంగా కార్మికుల పండుగ

#INTUCHujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం కార్మిక దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా INTUC  అనుబంధ యూనియన్ జెండాలను మిర్యాలగూడెం రహదారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రైసు మిల్లు డ్రైవర్ యూనియన్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్, రాజీవ్ ఆటో యూనియన్, సివిల్ సప్లై హమాలి యూనియన్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ల కార్మికులు పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా యరగాని నాగన్న గౌడ్ మాట్లాడుతూ సంఘటిత, అసంఘటిత కార్మికుల హక్కుల కోసం మరో పోరాటం చేయాల్సిన దుర్భర పరిస్థితులు ప్రస్తుతం దేశంలో నెలకొన్నాయని అన్నారు. కరోనాతో ప్రజా జీవన వ్యవస్థ నిర్వీర్యమైందని, కరోనాను తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. దేశంలో లో లో ఏడు లక్షలకు పైబడి చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఈ సంవత్సర కాలంలో మూతపడ్డాయని, దీనివల్ల కోట్లాదిమంది కార్మికులు రోడ్డున పడ్డారని, అట్టివారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవటంలో విఫలమయ్యాయని అన్నారు.

ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీకి శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నేటి పరిస్థితులలో ప్రతి పేద కుటుంబానికి 25 వేల రూపాయలు వారి వారి బ్యాంకు ఖాతాలో వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఐ ఎన్ టి యు సి అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య, గుంటుక కరుణాకర్ రెడ్డి,  సలిగంటి జానయ్య, మేళ్లచెరువు ముక్కంటి, పాశం రామరాజు, అంజనపల్లి సుదర్శన్, చప్పిడి సావిత్రి,రణపంగు రవీందర్, రాము, ఇన్నారెడ్డి, వీరబాబు, తోట లక్ష్మయ్య, దారేపల్లి సుగుణమ్మ, యడవెల్లి వీరబాబు, కాల్వ వెంకటేశ్వర్లు, గడ్డం వెంకటమ్మ,చౌడం శివపార్వతి తదితరులు పాల్గొన్నారు.

Related posts

మోటారు మెకానిక్ లకు వివిసి మోటార్స్ బియ్యం పంపిణీ

Satyam NEWS

ధ్వజారోహణంతో శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Satyam NEWS

ప్రారంభమైన రహదారి మరమ్మత్తు పనులు

Satyam NEWS

Leave a Comment