29.7 C
Hyderabad
May 22, 2024 01: 29 AM
Slider ఖమ్మం

చెక్కు బౌన్స్ కేసులో నిందితునికి శిక్ష ఖరారు

#cheaquebounce

చెక్ బౌన్స్ కేసులో నిందితునికి శిక్ష ఖరారు చేస్తూభద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన జడ్జి పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్ తీర్పునిచ్చారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. సారపాకకు చెందిన రామిశెట్టి శ్రీను నాగినేనిప్రోలుకు చెందిన గాదె ప్రభాకర్ రెడ్డి వద్ద నాల్గు లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని 2013 డిసెంబర్ 13న ప్రామిసరీ నోటు వ్రాసి ఇచ్చాడు. డబ్బులు తిరిగి ఇవ్వమని కోరగా 2019 మార్చి 17న న తన బ్యాంకు ఖాతా నుండి 4,90,000/- రూపాయలకు చెక్కు ఇచ్చాడు. అట్టి చెక్కును ప్రభాకర్ రెడ్డి తన ఖాతాలో వేసుకొనగా సరైన మొత్తం బ్యాంకులో లేని కారణంచేత చెక్కు బౌన్స్ అయినది. ఈ విషయంపై తన న్యాయవాది ద్వారా నోటీసు ఇచ్చినప్పటికీ డబ్బులు చెల్లించ నందున భద్రాచలం కోర్టులో ఫిర్యాదు చేశారు. కేసు విచారణ అనంతరం 2019 మే 7 న అప్పటి భద్రాచలం జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ సీ.సురేష్ ఆరు నెలల జైలు శిక్ష మరియు ఆరు లక్షల రూపాయలు ఫిర్యాదుదారుడికి నష్టపరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుపై రామిశెట్టి శ్రీను అప్పీలు చేసుకునగా ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి కింది కోర్టు తీర్పును ఖరారు చేస్తూ తీర్పు చెప్పారు. ఫిర్యాదుదారుని తరఫున న్యాయవాది ఎం. ఎస్. ఆర్. రవిచంద్ర వాదించారు.

Related posts

ఆర్ధిక లోటు గణనీయంగా తగ్గిన తెలంగాణ రాష్ట్రం

Satyam NEWS

కార్మికుల హక్కులకై పార్టీలకి అతీతంగా పోరాడుదాం: సిఐటియు

Satyam NEWS

రాయపూర్ లో కాంగ్రెస్ ప్లీనరీ

Murali Krishna

Leave a Comment