37.2 C
Hyderabad
May 2, 2024 11: 05 AM
Slider నల్గొండ

కార్మికుల హక్కులకై పార్టీలకి అతీతంగా పోరాడుదాం: సిఐటియు

#citu

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్ళచెరువు మండలం రామాపురం ప్రియా సిమెంట్ కర్మాగారంలో కాంట్రాక్ట్ కార్మికుల హక్కులకై జరిగే ఆకలి పోరాటానికి పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి కోరారు.

రామపురం ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీ గేటు ముందు కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా చేస్తున్న సందర్భంగా శీతల రోషపతి మాట్లాడుతూ కనీస వేతనం కల్పించాలని, ఏడు రోజుల నుంచి సమ్మె చేస్తుంటే యాజమాన్యం పట్టించుకోకుండా ఉండటం అన్యాయమని అన్నారు. కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని యాజమాన్యాన్ని కోరారు. ఎలక్ట్రిషన్,మెకానికల్,టెక్నికల్ వర్కర్స్ కి రోజుకు 410 రూపాయల నుంచి 475 ఇస్తున్నారని,సుతారి పని చేసేవారికి రోజుకి 700 రూపాయల నుంచి వెయ్యి రూపాయలు ఇస్తున్నారని, యాజమాన్యం కార్మికులతో తక్కువ వేతనంతో వేట్టిచాకిరి చేయిస్తుందని విమర్శించారు.కార్మికులు కుటుంబ సభ్యులతో గురువారం కృష్ణ పెట్టి ఏరియా సిమెంట్ క్లస్టర్ కమిటీ (సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో) ఫ్యాక్టరీ ముందు వంట వార్పు జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో కృష్ణ పట్టి ఏరియా సిమెంట్ క్లస్టర్ కమిటీ నాయకులు తీగల శ్రీను,వి.నాగేశ్వరరావు,ఆర్.శీను,బి. నాగేశ్వరరావు,బి.వెంకన్న,ఎస్ కె.జానీ, జానకిరామ్,నాగేశ్వరావు,జి.రామకృష్ణ, రామారావు,చంద్రగిరి,ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

విజ‌య‌న‌గ‌రంలో ఆర్.ఎస్.ఎస్ ప‌థ సంచ‌ల‌నం…!

Satyam NEWS

విజయనగరం రైల్వే స్టేషన్ కు మహర్దశ

Satyam NEWS

కరోనాతో కలుగులో దూరిన ఎమ్మెల్యేలూ ఎలా ఉన్నారు?

Satyam NEWS

Leave a Comment