23.7 C
Hyderabad
May 8, 2024 06: 44 AM
Slider ఖమ్మం

త్వరితగతిన మన ఊరు-మన బడి

#addl jc

మన ఊరు-మన బడి కార్యక్రమం క్రింద చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి అన్నారు.  కలెక్టరేట్ లోని తన చాంబర్ లో అధికారులతో పనుల పురోగతిపై అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 426 పాఠశాలల్లో మన ఊరు-మన బడి కార్యక్రమం క్రింద అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో 372 పాఠశాలల్లో ఉపాధిహామీ క్రింద పనులు జరుగుతున్నట్లు తెలిపారు. గుర్తించిన 63 పాఠశాలల్లో పెయింటింగ్ పనులు చేపట్టగా, 14 చోట్ల పూర్తయినట్లు, 49 చోట్ల ప్రగతిలో ఉన్నట్లు అన్నారు. ఇంకనూ 10 పాఠశాలల్లో పనులు ప్రారంభం కానట్లు, వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. పనుల పూర్తికి అధికారులు రోజువారీ సమీక్ష చేయాలని, వ్యక్తిగత శ్రద్ధ తో త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని అన్నారు.  ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి ఎస్. యాదయ్య, ఇఇలు నాగశేషు, శ్యామప్రసాద్, హేమలత, శ్రీనివాసరావు, చంద్రమౌళి, కృష్ణ లాల్, ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ, డిఇ లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

గ్యాంగ్‌స్టర్ నయీం ఆస్తులపై సీఎం రేవంత్ న్యాయవిచారణ చేయిస్తారా?

Satyam NEWS

వనపర్తి అభివృద్ది చూసి ఆనందపడుతున్నా: మంత్రి హరీష్ రావు

Satyam NEWS

దంచి కొడుతున్న ఎండలు

Satyam NEWS

Leave a Comment