32.2 C
Hyderabad
May 21, 2024 12: 43 PM
Slider కవి ప్రపంచం

అక్షయ తృతీయ పర్వానికి…

#Purimalla Sunanda New

జపం తపం హోమం దానం

వైశాఖ శుద్ధ తదియ నాడు

చేసే సత్కర్మల పుణ్యకార్య ఫలితాలు

అక్షయమై అజరామరమై విరాజిల్లేలా చేసేదే అక్షయ తృతీయ..

అక్షతోదకంతో స్నానం

ఉపవాస దీక్షను ఆచరిస్తూ

అక్షతలతో ఇష్ట దైవం విష్ణు భగవానునికి చేసే

సాష్టాంగ నమస్కారం

సిరి సంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మికి

భక్తి శ్రద్ధలతో పూజ చేసే  పర్వ దినమే అక్షయ తృతీయ.

ప్రహ్లాదుని అనుగ్రహించిన రోజు

వేదవ్యాసుడు మహా భారతాన్ని విఘ్నేశ్వరునికి చెప్పగా

రాయడం మొదలు పెట్టిన రోజు

ధర్మ రాజుకు శ్రీకృష్ణుడు అక్షయ పాత్ర నొసగిన రోజిదే

స్నేహితుడు కుచేలుడి పేదరికాన్ని పోగొట్టిన రోజూ ఇదే..

ఉన్నంతలో పిసరంతైనా బంగారాన్ని కొనుక్కుందాం

చేతనైనంత  పేదసాదలకు  ఇతోధిక దానం ధర్మం  చేద్దాం

అదే మనకు కలిగిస్తుంది ఎంతో ఆత్మ తృప్తి ఆనందం

అక్షయ తృతీయ పర్వానికి జరుగుతుంది సరైన న్యాయం..

వురిమళ్ల సునంద, ఖమ్మం

Related posts

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలి

Bhavani

సంపదను సృష్టిద్దాం.. ప్రజలకు పంచుదాం

Bhavani

కొత్త సమీకరణాల్లో అస్థిత్వం కోల్పోయిన బిజెపి

Satyam NEWS

Leave a Comment