29.7 C
Hyderabad
May 4, 2024 05: 36 AM
Slider గుంటూరు

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలి

#cpi

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేటికరించడానికి వ్యతిరేకిస్తూ సిపిఐ, సిపిఎం,టిడిపి, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం మంగళగిరిలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. తొలుత ఆయా పార్టీల కార్యాలయం నుండి ప్రదర్శనగా అంబేద్కర్ సెంటర్ కు చేరుకున్నారు.

ఈ సందర్భంగా జరిగిన ధర్నా కార్యక్రమంలో , ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేడ హనుమంతరావు, సిపిఐ నియోజకవర్ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య,సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ ఎస్ చేంగాయ్య, టిడిపి నాయకులు వాకా మాధవరావు మాట్లాడారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకోవడం జరిగిందని వివరించారు.

లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఫ్యాక్టరీని వేల కోట్ల రూపాయలకు కారు సౌకగా పెట్టుకోదారులకు అమ్మడానికి మోడీ ప్రభుత్వం చూస్తుందని అన్నారు. మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని విమర్శించారు. కొంతమంది ప్రాణాల త్యాగాలతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సాధించడం జరిగిందని తెలిపారు. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుందని తెలిపారు. మోడీ ప్రభుత్వం చేస్తున్న విధానాన్ని రాష్ట్ర ప్రజలందరూ సమైక్యంగా ఉండి త్రిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో , సిపిఐ నాయకులు యార్లగడ్డ వెంకటేశ్వరరావు, జాలాది జాన్ బాబు, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి, అన్నవరపు ప్రభాకర్, ఏ ఐ టి యు సి నియోజకవర్గ అధ్యక్షులు, చిన్ని సత్యనారాయణ, పిల్లల మరి నాగేశ్వరరావు పంతగాని మరియదాసు, కాబోతు ఈశ్వరరావు, సత్యానందం, దొడ్డి ఈశ్వరరావు, మరియదాసు, ఎం వేంకటేశ్వరులు సిపిఎం సీనియర్ నాయకులు పి బాలకృష్ణ, పట్టణ నాయకులు ఎస్ గణేష్, బి స్వామినాథ్, టి హేమ సుందర్ రావ్ టిడిపి నాయకులు గోవాడ దుర్గారావు, సింహాద్రి రామారావు, సిహెచ్ వెంకటేశ్వరరావు, ఏ నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

3 కోట్ల మొక్కల చేరువలో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌

Satyam NEWS

టిటిడి అనుబంధ ఆలయాల దర్శనానికి టిక్కెట్లు తీసుకునే విధానం ఇది

Satyam NEWS

పోస్టుపోన్: శ్రీవారి భక్తులకు పాక్షిక విజయం

Satyam NEWS

Leave a Comment