30.2 C
Hyderabad
May 17, 2024 19: 36 PM
Slider ముఖ్యంశాలు

సంపదను సృష్టిద్దాం.. ప్రజలకు పంచుదాం

#kcr1

సంపదను సృష్టించి ఆ సంపదను ప్రజలకు పంచుదామని సీఎం కేసీఆర్ అన్నారు. భవిష్యత్ లో ఉద్యోగుల జీతాలను పెంచుకుందామన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించిన కేసీఆర్.. సమీకృత కలెక్టరేట్, ఎస్పీ, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం ఎస్పీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో

మాట్లాడారు. తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉందని ఈ విజయం అందరం సమిష్టిగా పని చేస్తేనే సాధ్యమైందన్నారు.

తాము హైదరాబాద్ లో కూర్చుని ఎలాంటి కార్యక్రమాలు రూపకల్పన చేసినా వాటిని విజయవంతం చేసిన ఘనత ఉద్యోగులకు చెందుతుందన్నారు. ఉద్యోగులు ఇదే స్ఫూర్తితో పని చేయాలన్నారు. వలసల పాలమూరు జిల్లాలో గడిచిన

తొమ్మిదేళ్లలో అనేక అద్భుతాలు జరిగాయని కల్వకుర్తిలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. త్వరలోనే పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని చెప్పారు. అనేక పెద్ద రాష్ట్రాల కంటే తెలంగాణ అన్ని విషయాల్లో ముందు వరుసలో ఉందని దేశంలో వస్తున్న ఐటీ ఉద్యోగాల్లో 50 శాతం హైదరబాద్ లోనే ఉన్నాయన్నారు.

Related posts

ఒక్క రోజు దీక్ష: వైఎస్‌ షర్మిల అరెస్టు

Satyam NEWS

అనధికార బ్లాస్టింగ్ లు ఆపాల్సిందే లేకుంటే చర్యలు తప్పవు

Satyam NEWS

బ్రాహ్మణులకు అన్యాయం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment