27.7 C
Hyderabad
May 21, 2024 06: 06 AM
Slider కవి ప్రపంచం

ఉద్యమబాట..

#Devalapally Sunanda

ఆరాట పడుతూ కూర్చుంటే ఒరిగేదేమీ లేదు
ఉద్యమంతో అడుగులు కలిపి పోరాటం చెయ్

లేదంటే కనీసం వ్యతిరేకతను వ్యక్తం చెయ్
నాకెందుకులే అని నీవనుకుంటే…
ఎక్కడి గొంగలిఅక్కడే అన్నట్లు
ఏ ఎదుగుబొదుగు నీకుండదులే…!

తలకుమించిన పనులు
తలకుమాసిన పనులను సైతం
బరువు అనుకోకుండా బాధ్యతగా నిర్వర్తిస్తుంటే
కర్రీలో కరివేపాకులా తీసిపారేస్తుంటే..!

నిమ్మకు నీరెత్తినట్లు మిన్నకుండి పోతావా…!
నేను సైతం అంటూ ఉద్యమంలో పాల్గొంటావా..!
ఇంట్లో కూర్చుని చోద్యం చూస్తావా ..!

ఆలోచనా నీదే, ఆచరణా నీదే..
నిర్ణయం నీదే….సాధించబోయే విజయం కూడా నీదే..!

దేవలపల్లి సునంద, రంగారెడ్డి జిల్లా, 8297744716

Related posts

తెలుగువారంతా గర్వపడే సినిమా “భార‌తీయ‌న్స్‌”

Satyam NEWS

కేసీఆర్ వీరాభిమాన సంఘం నూతన కార్యవర్గం

Satyam NEWS

17 నుంచి 26వ తేదీ వరకు తిరుచానూరులో నవరాత్రి ఉత్సవాలు

Satyam NEWS

Leave a Comment