37.2 C
Hyderabad
May 6, 2024 21: 25 PM
Slider ఆధ్యాత్మికం

10 నుండి 18 వరకు తాళ్లపాక శ్రీ చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

#chennakesavatemple

అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం లోని తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 10 నుండి 18వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.  బ్రహ్మోత్సవాలకు జూలై 9వ తేదీ అంకురార్పణ నిర్వహిస్తారు. జూలై 10న ఉదయం 9 నుండి 10 గంటల మధ్య ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

రాత్రి శేషవాహన సేవ నిర్వహిస్తారు. జూలై 11, 12, 13, 14, 15, 16, 17వ తేదీల్లో ఉదయం పల్లకీ సేవ నిర్వ‌హిస్తారు. అదేవిధంగా జూలై 11న రాత్రి హంస వాహనం, జూలై 12న రాత్రి సింహ వాహనం, జూలై 13న రాత్రి హనుమంత వాహనం, జూలై 14న రాత్రి గరుడవాహ‌నంపై స్వామివారు భక్తులకు కనువిందు చేస్తారు.

జూలై 15వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది.గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

ఆ తరువాత రాత్రి 8.30 గంటలకు గజ వాహనంపై స్వామివారు విహరిస్తారు. జూలై 16న సాయంత్రం 6 గంటలకు రథోత్సవం, జూలై 17న రాత్రి అశ్వవాహనం, జూలై 18న ఉదయం 10 నుండి 11 గంటల వ‌ర‌కు చక్రస్నానం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 6 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్ర‌హ్మోత్స‌వాల‌లో ప్ర‌తి రోజు ఉద‌యం 9 గంట‌ల‌కు, రాత్రి 7 గంట‌ల‌కు వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు.

Related posts

హుజూర్ నగర్ సహకార బ్యాంకుకు సిమెంటు బల్లలు

Satyam NEWS

రాబోయే కాలంలో క్రీడా రంగానికి పెద్ద పీట

Satyam NEWS

క్షీర సాగర మధన సారం

Satyam NEWS

Leave a Comment