26.7 C
Hyderabad
May 21, 2024 07: 19 AM
Slider కవి ప్రపంచం

ఇలా కూడా

#ManjulaSuryaVD

రావనే అనుకున్నా

నాతో నీకు పొసగదనే అనుకున్నా

చొచ్చుకొచ్చేశావ్ కొంగ్రొత్త బ్రాండ్ లా

చుట్టేసావ్ అంతటా  వైఫైలా

అంటిపెట్టుకున్నావ్ మొబైల్ ఫోనులా

దేనికైనా నేనున్నానంటావ్ గూగుల్ లా

విడదీయరాని బంధమే అయ్యావు వాట్సాప్ లా

నిండిపోతోంది మది నీతో 

అనుక్షణం ప్రతీది పంచుకునే ఫేస్ బుక్ లా

ఉండిపోయావు హృదయంలో చిత్రంగా

ఎప్పుడూ మొబైల్ ని అంటిపెట్టుకునే

వాల్ పేపర్ లా

పలకరిస్తూనే ఉంటావు ఇన్ కమింగ్ కాల్ లా

ఊసుపోనివ్వకుండా చేస్తావు

మోగే రింగ్ టోన్ లా

కోపమొస్తే ముడుచుకుంటావు

మిస్డ్ కాల్ లా

ప్రేమంటే భావన కాదు

బాధ్యత సుమా

పట్టనట్టుగా ఉండిపోకు

ఔటర్ కవరేజ్ నెట్ వర్కు లా

ప్రేమంటే వెన్నుతట్టి ప్రోత్సహించే

ప్రోత్సాహమే

ఆఫర్లు ఇచ్చే నెట్ వర్కు లా

ప్రేమంటే ఒక రక్షక కవచం మొబైల్ కవర్ లా

ప్రేమంటే ఒక భరోసా  యూ ట్యూబ్ లా

నాకే ప్రత్యేకమైన నా మెయిల్ ఐడి లా

ఒకరి కోసం ఒకరన్నట్టుగా

ఎప్పుడు అందుబాటులో ఉండే మొబైల్ డేటా లా

డౌన్లోడ్ ఐపోయావ్ గూగుల్ ప్లేలో ఆప్ లా

( వాలంటైన్స్ డే సందర్బంగా )

మంజుల సూర్య, హైదరాబాద్

Related posts

ప్రొఫెసర్ జయ శంకర్ సార్ ఆశయ సాధన దిశగా పాలన

Satyam NEWS

Flash News: రేపు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్‌

Satyam NEWS

క్యాన్సర్, కోవిడ్ తో ఏక కాలంలో పోరాడి గెలిచిన మహిళ

Satyam NEWS

1 comment

Yuddandi Siva Subramanyam February 15, 2021 at 3:42 AM

మీ రచనాశైలి హృదయానికి హత్తుకునేలా ఉంది.

Reply

Leave a Comment