27.7 C
Hyderabad
April 26, 2024 06: 00 AM
Slider ముఖ్యంశాలు

క్యాన్సర్, కోవిడ్ తో ఏక కాలంలో పోరాడి గెలిచిన మహిళ

#Balakrishna

ఒక వైపు తీవ్రమైన క్యాన్సర్ మరో వైపు కోవిడ్ మహమ్మారి చుట్టుముట్టడంతో తీవ్ర అనారోగ్యానికి గురైన రోగికి ప్రాణం పోశారు హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ వైద్యులు. 

ఆంధ్ర ప్రదేశ్ శ్రీ కాళహస్తికి చెందిన 31 ఏళ్ల చైతన్య అనే మహిళ కు జూలైలో క్యాన్సర్ వ్యాధి వచ్చినట్లు స్థానికంగా ఉన్న వైద్యులు గుర్తించారు. స్థానిక వైద్యుల సూచనల మేరకు  ఆమెను సెప్టెంబర్ 9 న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు తరలించారు.

డా. సికె నాయుడు చైతన్యను పరీక్షించి, రొమ్ములో భారీ గడ్డను(ట్యూమర్ ను) గుర్తించి ఆమెకు వెంటనే సర్జరీ చేయాల్సి ఉంటుందని సూచించారు. అయితే దురదృష్టవశాత్తు చైతన్యకు నిర్వహించిన కోవిడ్ పరీక్షలో పాజిటివ్ రావడం ఆమె పాలిట శాపంగా మారింది.

చైతన్యను ఐసోలేషన్ వార్డులో ఉంచి మూడు వారాల పాటూ కోవిడ్ కు క్యాన్సర్ కు చికిత్స అందించడం ప్రారంభించారు కోవిడ్ నెగిటివ్ వచ్చిన వెంటనే చైతన్యకు డా. సికె నాయుడు బృందం శస్త్ర చికిత్స నిర్వహించి ఆమె రొమ్ములో ఉన్న బారీ ట్యూమర్ (కణితిని) తొలగించారు.

కోలుకున్న చైతన్య హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయి స్వంత ఊరుకు వెళ్లింది. రెండు వారాల తర్వాత మళ్లీ పరీక్షలు నిర్వహించుకున్నది.  చికిత్స విజయవంతంగా పూర్తయిన నేపధ్యంలో నేడు హాస్పిటల్ వైద్యుల బృందం, క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ సమక్షంలో చైతన్య విజయగాధను మీడియాకు వివరించారు.

శస్త్ర చికిత్స తదనంతరం సేవలను అందించిన డా. సికే నాయుడు నేతృత్వంలోని రొమ్ము క్యాన్సర్ వైద్య బృందంతో పాటూ రోగిని కాపాడడంలో డా. బసంత్ కుమార్ నేతృత్వంలో అనస్థీషియా, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వైద్యులు చేసిన కృషి చెప్పుకోదగింది.

వారి కృషి ఫలితంగా చైతన్య పూర్తిగా కోలుకోగలిగిందని CEO డా. ఆర్ వి ప్రభాకర రావు మీడియాకు వెల్లడించారు. నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ చైతన్యకు కోవిడ్ మహమ్మారి లాంటి వ్యతిరేక పరిస్థితులలో కూడా ధైర్యంగా శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యుల బృందాన్ని అభినందించారు.

పేదరికంలో మగ్గుతున్న కుటుంబానికి చెందిన చైతన్య కు వచ్చిన కష్టం చాలా పెద్దదని, విషయం హాస్పిటల్ దృష్టికి రాగానే కేసును చాలెంజ్ గా తీసుకొని వైద్యం ఉచితంగా నిర్వహించాలని నిర్ణయించి ముందుకు వెళ్లినట్లు వెల్లడించారు. 15 లక్షలకు పైగా ఖరీదు చేసే ఈ వైద్యాన్ని పేషెంటుకు పూర్తిగా ఉచితంగా ఏ రకమైన ఖర్చు లేకుండా చేశామని తెలిపారు.

Related posts

ఆత్మకూరు ప్రాంతంలో పెద్ద పులి పిల్లల కలకలం

Satyam NEWS

భారత్ కు భారీ రుణం ఇచ్చేందుకు సిద్ధమైన ఏడిబి

Satyam NEWS

ప్ర‌జల భాగ‌స్వామ్యంతో అభివృద్ది ప్ర‌ణాళిక‌లు..!

Satyam NEWS

Leave a Comment