27.7 C
Hyderabad
May 22, 2024 04: 18 AM
Slider విశాఖపట్నం

మళ్లీ టీడీపీ భజన ప్రారంభించిన గంటా

#MLA Ganta Srinivasa Rao

పార్టీ మారేందుకు అన్ని దారులు మూసుకుపోయిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇప్పుడు ఇక తప్పక తెలుగుదేశం మాటలే వినిపించడం మొదలు పెట్టారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పిన మహా వ్యక్తి ఎన్టీఆర్…. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి…జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారు… పరిపాలన పరంగా ఎన్నో సంస్కరణలు తెచ్చిన ఘనత ఎన్టీఆర్ దే…. రాబోయే రోజుల్లో టిడిపి ఘన విజయాలు సాధిస్తుంది అని ఆయన అన్నారు.

విశాఖపట్నంలోని టిడిపి ఆఫీసులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి సభకు హాజరైన ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు ఒక వైబ్రేషన్ అని అన్నారు. పార్టీని స్థాపించి 9 నెలలులోనే అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్ ది. తెలుగు నేలపై ఎన్టీఆర్ ది చెరగని సంతకం అని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ఈ నెల 27 నుంచి ప్రారంభం అవుతుందని, 400 రోజులు..4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారని ఆయన తెలిపారు. 175 నియోజక వర్గాల్లో అన్ని ఏర్పాటు జరుగుతున్నాయి… లోకేష్ యువగళం పాదయాత్ర సెన్సేషనల్ హిట్ అవుతుందని ఆయన అన్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి టిడిపి నేతలు నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ పార్లమెంటరీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు, పశ్చిమ శాసనసభ్యులు పీవీజీర్ నాయుడు (గణబాబు ), ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పిలా శ్రీనివాసరావు, విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి సిహెచ్ పట్టాభిరామ్, చిక్కాల విజయ్ బాబు, రాజమండ్రి నారాయణ, పైల ముత్యాల నాయుడు గోగినేని సాంబశివరావు, గొలగాని వీరారావు బుజ్జి విల్లురి చక్రవర్తి, బొట్టా వెంకటరమణ, కాళ్ళ శంకర్ అక్కిరెడ్డి జగదీష్ నక్క కనకరాజు ఈతలపాక సుజాత

బొడ్డేపల్లి లలిత తమ్మిన విజయకుమార్ కోట నరేష్ వలిసెట్టి తాతాజీ మోదీ అప్పారావు మేక సత్య కిరణ్, బుడుమూరి గోవింద్ అనసూరి మధు గణగళ్ల సత్య బొట్టాపరదేశి యాదవ్,పొడుగు కుమార్, బండుబిల్లి సూర్యనారాయణ కోనేటి సురేష్ తెడ్డిరాజు పలిశెట్టి అప్పన్న ఉరుకుటి గణేష్ ముల అప్పారావు, ఊరుకోటి పైడ్రాజు ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో రక్తదానం శిబిరం నిర్వహించారు.

Related posts

9న ఒంటిమిట్టలో శ్రీ‌రామ‌న‌వ‌మి బ్రహ్మోత్సవాలకు అంకురార్ప‌ణ‌

Satyam NEWS

సోమును తీసేయకపోతే బీజేపీ బతకడం కష్టం

Satyam NEWS

ప్రైవేట్ ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment