29.7 C
Hyderabad
May 1, 2024 09: 24 AM
Slider

బీఆర్ఎస్ తెలంగాణ అధ్యక్షుడిగా ఒక దళితుడు?

#kcr

జాతీయ పార్టీ బీఆర్ఎస్ కు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ కాబట్టి ఇతర రాష్ట్రాలలో అధ్యక్షులను నియమించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయినందున అన్ని రాష్ట్రాలలో పార్టీ అధ్యక్షులను నియమించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు కేసీఆర్ ఆ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ అయినందున ఆయన జాతీయ అధ్యక్షుడు అవుతారు. ఇప్పుడు తెలంగాణకు అధ్యక్షుడిని నియమించాల్సిన అవసరం ఏర్పడింది.

తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షుడుగా ఒక దళితుడిని నియమించేందుకు ఆలోచన చేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే అనివార్యతల వల్ల ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత దళితుడిని ఉప ముఖ్యమంత్రి చేశారు కానీ అది పూర్తి కాలం కొనసాగలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని సీఎం చేయాలని ఎవరూ కోరకపోయినా అవకాశం వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఒక దళితుడిని చేయాలనే వాదన మొదలైంది.

రాబోయే ఎన్నికలలో జాతీయ పార్టీ అధ్యక్షుడు అయిన కేసీఆర్ అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం కూడా ఉండదు. ఆయన లోక్ సభకు పోటీ చేయాల్సి ఉంటుంది. ప్రధాన మంత్రి అభ్యర్ధి కావాలంటే కనీసం ఎంపిగా కాకుండా అవకాశం ఉండదు. అందువల్ల కేసీఆర్ లోక్ సభకు వెళ్లిపోతే ఎంపిక అయ్యే ఎమ్మెల్యేల నుంచి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు.

అది తర్వాత సంగతి. ఇప్పుడు బీఆర్ఎస్ కు రాష్ట్ర అధ్యక్షుడిని నియమించే అధికారం సంపూర్తిగా కేసీఆర్ చేతిలోనే ఉన్నందున, ఈ పదవిని ఒక దళితుడికి ఇవ్వాలని చాలా మంది కోరుతున్నారు. ఒక గిరిజన మహిళను రాష్ట్ర పతిని చేసిన బీజేపీ ఆ విషయాన్ని విస్త్రతంగా ప్రచారం చేసుకున్నది. తద్వారా దళిత బహుజన వర్గాలకు పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పుకున్నది.

అదే విధంగా ఒక దళితుడిని పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే విషయాన్ని గర్వంగా చెప్పుకున్నది. అలాగే బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో ఎదగాలనుకుంటున్న బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడిగా దళితుడిని కానీ గిరిజనుడిని కానీ పెట్టుకునే అవకాశం లేదు. కనీసం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగానైనా దళితుడిని నియమించుకుంటే కనీసం బయటి రాష్ట్రాలలో చెప్పుకోవడానికి అనువుగా ఉంటుందని పలువురు వాదిస్తున్నారు.

Related posts

మహా శివరాత్రి శుభాకాంక్షలతో సంధ్య స్టూడియోస్ “తొలి ఏకాదశి”

Satyam NEWS

ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందా?

Satyam NEWS

విడతలవారీగా పంపిణీ చేయడం బాధాకరం

Satyam NEWS

Leave a Comment