26.7 C
Hyderabad
May 3, 2024 08: 05 AM
Slider ఆధ్యాత్మికం

9న ఒంటిమిట్టలో శ్రీ‌రామ‌న‌వ‌మి బ్రహ్మోత్సవాలకు అంకురార్ప‌ణ‌

vontimitta Ramalayam

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 10 నుండి 18వ తేదీ వరకు జరుగనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఏప్రిల్ 9న శ‌నివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన నిర్వ‌హిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు అర్చకులు వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహిస్తారు. ఏప్రిల్ 10న ఆదివారం ఉదయం 8 నుండి 9 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. సాయంత్రం 4 నుండి రాత్రి 7 గంటల వరకు పోతన జయంతి, కవి సమ్మేళనం, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శేష వాహనసేవ నిర్వ‌హిస్తారు. ప్రతిరోజూ ఉదయం  8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివ‌రాలు

తేదీ                  ఉదయం           రాత్రి

10-04-2022(ఆది) ధ్వజారోహణం(ఉ|| 8-9గం||ల)(వృష‌భ ల‌గ్నం), పోతన జయంతి, శేషవాహనం.

11-04-2022(సోమ‌) వేణుగాన అలంకారం, హంస వాహనం.

12-04-2022(మంగ‌ళ‌) వటపత్రశాయి అలంకారం, సింహ వాహనం.

13-04-2022(బుధ‌) నవనీతకృష్ణ అలంకారం, హనుమత్సేవ‌.

14-04-2022(గురు) మోహినీ అలంకారం, గరుడసేవ.

15-04-2022(శుక్ర) శివధనుర్భంగాలంకారం, శ్రీ సీతారాముల కల్యాణం (రా|| 8 గం||లకు), గ‌జవాహనం.

16-04-2022(శ‌ని) రథోత్సవం.

17-04-2022(ఆది) కాళీయమర్ధన అలంకారం, అశ్వవాహనం.

18-04-2022(సోమ‌) చక్రస్నానం, ధ్వజావరోహణం(రా. 7 గం).

19-04-2022(మంగ‌ళ‌) పుష్పయాగం(సా. 6 గం.).

Related posts

యాదాద్రి, వర్గల్ దేవాలయాలకు ఫడ్ సేఫ్టీ జాతీయ గుర్తింపు

Satyam NEWS

కేంద్రం ప్రవేశ పెట్టిన అద్భుతమైన పథకం ఈ శ్రమ్

Satyam NEWS

ఎలిగేషన్: రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తున్నది

Satyam NEWS

Leave a Comment