39.2 C
Hyderabad
May 3, 2024 14: 05 PM
Slider ప్రత్యేకం

సోమును తీసేయకపోతే బీజేపీ బతకడం కష్టం

#somuveeraju

సోము వీర్రాజును తొలగించకపోతే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మనుగడ సాగించడం కష్టమేనని పలువురు బీజేపీ నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు నేడు ఢిల్లీ వెళ్లిన ఏపి బీజేపీ నాయకులు సోము వీర్రాజుపై పూర్తి స్థాయిలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను సోము వీర్రాజు పగబట్టి వెళ్లగొట్టారని, ఆయన  వెళ్లిపోవడం బీజేపీ కి నష్టమే అని కొందరు బీజేపీ సీనియర్ నాయకులు భావిస్తున్నారు.

కన్నా పార్టీ విడడానికి సోము వీర్రాజు మాత్రమే కారణం అని వారు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కొందరు ముఖ్యనేతలు ఢిల్లీ వెళ్లి కలిసిన వారిలో మురళీధర్ ఉన్నారు. ఆయనను కలిసిన వారు సోము వీర్రాజు ను అధ్యక్షుడుగా తొలగించాలని, కొత్త కమిటీ లు నియమించాలని కోరారు. ఈ రోజు ఢిల్లీ వెళ్లిన బీజేపీ నాయకులు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు లాంటి ముఖ్యనేతలకు సమాచారం కూడా ఇవ్వలేదు. అంతే కాకుండా ఏపీ లో జరుగుతున్న పరిణామాలు వారు పూర్తిగా వివరించినట్టు సమాచారం.

అలసత్వ వహిస్తే కన్నా లక్ష్మీనారాయణ లాగే మరికొందరు తలోదారి చూసుకునేలా పరిస్థితి ఉన్నట్టు సమాచారం అందించినట్లు సమాచారం. అలాగే ఏపీ బీజేపీ లో రెండు వర్గాలు ఉన్నట్టు కూడా వివరించినట్టు టాక్. పైకి అంతా బాగానే ఉన్నా లోపల మాత్రం అసంతృప్తి గళం వినిపిస్తున్న నేతలది పెద్ద లిస్ట్ ఉన్నట్టు టాక్. పురంధేశ్వరి, మాజీ ఎం.ఎల్. ఏ విష్ణు కుమార్ రాజులు సైతం టీడీపీ వైపు చూస్తున్నారని చెబుతున్నారు.

సోము వీర్రాజును మార్చకపోతే కష్టమే అని సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సోము, జీవిల్, సునీల్ , విష్ణు వర్ధన్ రెడ్డి వర్గాలు జగన్ కు కోవర్ట్ గా వ్యవహరిస్తూ యాంటీ టీడీపీ వర్గం గా మారారని, దీని వల్ల అధికార పార్టీ తప్పులను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లగలమని  కేంద్ర పెద్దల వద్ద వాపోయినట్టు సమాచారం. కేవలం సత్యకుమార్, విష్ణు కుమార్ రాజు లు మాత్రమే వైకాపా పై పెద్ద స్థాయిలో విమర్శలు చేస్తున్నారని, మిగతా వారు సాఫ్ట్ కార్నర్ లో వ్యవహరిస్తున్నారని బీజేపీ పెద్దలకు ముఖ్యనాయకులు తెలిపినట్టు సమాచారం.

ఇలా ఐతే కష్టం అని.. త్వరగా చర్యలు చేపట్టి ఏపీ బీజేపీ ని ఓ గాడిలో పెట్టాలని కోరినట్టు సమాచారం. అలాగే ఏపీ బీజేపీ లో మరో వర్గం టీడీపీ తో పొత్తు తేల్చాలని, పొత్తు ఉంటే ఫలితం ఉంటుందని వాదిస్తున్నట్లు సమాచారం. మరో వర్గం బీజేపీ జనసేన తో మాత్రమే వెళ్తే బాగుంటుందని, జనసేన తప్పుకుంటే  ఒంటరిగానే బలపడలని సూచిస్తున్నట్లు సమాచారం.

రామకృష్ణ పూడి, సత్యంన్యూస్.నెట్

Related posts

రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలకు మొబైల్స్ పంపిణీ

Satyam NEWS

గులాబీమయమైన అంబర్ పేట

Satyam NEWS

పోలీసు ఉద్యోగాలకు ములుగులో ఫ్రీ కోచింగ్

Satyam NEWS

Leave a Comment