27.7 C
Hyderabad
May 21, 2024 04: 02 AM
Slider క్రీడలు

జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలి

#Vemula Prashanth Reddy

నేటి విద్యార్థులను జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర రోడ్లు,భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం బాల్కొండ మండల కేంద్రం లోని పాండురంగ ఫంక్షన్ హాల్ లో ప్రముఖ వ్యాపారవేత్త ఏనుగు దయానంద్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 11 ఉత్తమ పాఠశాలలకు అందించిన స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.

సమాజంలో దైవం, తల్లిదండ్రుల తరువాత స్థానంలో ఉపాధ్యాయులదేనని అన్నారు. ఉపాధ్యాయులు నేటి విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలన్నారు. పాఠశాలల స్థాయి నుంచే క్రీడలు అలవాటు చేయాలన్నారు. జిల్లాలోని పాఠశాలల్లో ఏనుగు దయానంద రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు.

ఏనుగు దయానంద రెడ్డి తన వియ్యంకుడు కావడం, రిటైర్డ్ పిడి ఇంద్రారెడ్డి తన మామ కావడం, వారిద్దరి మధ్య ఈరోజు ఈ కార్యక్రమంలో వారిద్దరి మధ్య పాల్గొనడం గర్వంగా ఉందన్నారు. తన సంపాదనలో పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల క్షేమం కోసం ఖర్చు చేయడం అభినందనీయమన్నారు. దయానంద్ రెడ్డి లా ఇలా అందరూ ముందుకు వస్తే పాఠశాలలు ఎంతో అభివృద్ధి చెందుతాయన్నారు. అనంతరంజాతీయస్థాయిలో రాణించిన క్రీడాకారులను సన్మానించారు.

ఓ విద్యార్థి బాగుపడ్డా, చెడిపోయిన గురువుదే బాధ్యత

ఓ విద్యార్థి బాగుపడ్డా, చెడిపోయిన గురువు దే బాధ్యత అని ప్రముఖ పారిశ్రామికవేత్త ఏనుగు దయానంద్ రెడ్డి అన్నారు. ఉన్నత స్థాయికి ఎదిగి గురువులకు నిజమైన గురుదక్షిణ అందించాలన్నారు. సమాజంలో కష్టపడి సంపాదించుకోవడం నేర్చుకోవాలని ఆయనఅన్నారు. అడ్డదారుల సంపాదించిన డబ్బు ఏదో రూపంలో తెలియకుండానే పోతుందన్నారు.

ఉపాధ్యాయులు కష్టపడి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలన్నారు. అనంతరం ప్రముఖ పారిశ్రామికవేత్త ఏనుగు రెడ్డిని, రిటైర్డ్ పిడి ఇంద్రారెడ్డిని శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్,మండల విద్యాధికారి రాజేశ్వర్, తాహసిల్దార్ వినోద్, ఎంపీడీవో సంతోష కుమార్, సర్పంచ్ సునీత, వైస్ ఎంపీపీ శ్రీకాంత్,ఉప సర్పంచ్ షేక్ వాహబ్,బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సాగర్ యాదవ్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,పిఈటిలు, పీడీ లు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అధికార పార్టీకి స్థానిక అభ్యర్ధి కరవు

Bhavani

ఏసీబీకి దొరికిపోయిన అవినీతి అధికారులు

Satyam NEWS

పదో తరగతి పరీక్షల్లో హిందీ భాషలో ఎలా స్కోర్ చేయాలి?

Satyam NEWS

Leave a Comment