27.7 C
Hyderabad
May 21, 2024 05: 35 AM
Slider విజయనగరం

ప్రయాణాల్లో మన భద్రతతోపాటు ఇతరుల భద్రతకు ప్రాధాన్యతనివ్వాలి

#SP M. Deepika

రహదారి భద్రత పట్ల యువతకు అవగాహన కల్పించేందుకుగాను వారం రోజుల పాటు ఏపీ రాష్ట్ర పోలీసు శాఖ రహదారి భద్రతా ఉత్సవాలను నిర్వహిస్తొంది. అందులో భాగంగా విజయనగరం లెండి ఇంజనీరింగు కళాశాలలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎం. దీపిక ముఖ్య అతిధిగా పాల్గొనడంతో.. లెండీ ఇంజనీరింగు కళాశాల ఫౌండర్ ప్రిన్సిపాల్ డా. వి.వి. రామిరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డా.హరిబాబు, కళాశాల ఫెమీనా సభ్యులు డా. జానకి, డా. పి.డి.శైలజ, కళాశాల విద్యార్థులు జిల్లా ఎస్పీ ఎం. దీపికకు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ వాహనాలను అతి వేగంగా నడపవడం వలన మనం
గమ్యాన్ని చేరుకొనేలోగా 10 నిమిషాలు సమయాన్ని మాత్రమే మిగుల్చుకోగలమని, అతి వేగంతో ప్రమాదానికి గురైతే ప్రాణాలు కోల్పోవడం లేదా తీవ్రమైన గాయాలపాలై, అంగవైకల్యం ఏర్పడి జీవితాలనే కోల్పోయి, భారీ మూల్యం చెల్లించే పరిస్థితులు ఏర్పడతయన్నారు. కావున, యువత వాహనాలను సురక్షితంగా నడిపేందుకే మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అంతేకాకుండా, వాహనాలను నడిపేందుకు లైసెన్సు కలిగి ఉండడంతోపాటు, తప్పనిసరిగా హెల్మెట్
ధరించడం, భద్రత నియమాలు పాటించాలన్నారు.

చాలా వరకు రోడ్డు ప్రమాదాలు అతి వేగం, త్రిబుల్ రైడింగు, మద్యం సేవించి వాహనాలను నడపడం వలనే జరుగుతున్నాయన్నారు. వాహనాలు నడపడంలో నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువకులే ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. జాతీయ రహదారులను అనుమతి ఉన్న చోటనే క్రాస్ చేయాలన్నారు. చాలామంది వాహనదారులు చేరుకోవాల్సిన గమ్యంపై దృష్టి పెట్టకుండా, వాహనాలను నిర్లక్ష్యంగా నడుపుతూ, ప్రమాదాలకు గురవుతున్నారని, అలాకాకుండా, ప్రతీ ఒక్కరూ భద్రత నియమాలు పాటించడంతోపాటు, ప్రయాణాల్లో మన భద్రతతోపాటు, ఇతరుల భద్రతకు కూడా ప్రాధాన్యత నివ్వాలన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువమంది ప్రయాణికులను అనుమతించే ఆటోలను ఎక్కవద్దని విద్యార్థులకు జిల్లా ఎస్పీ ఎం. దీపిక సూచించారు. లెండీ కళాశాల ఫౌండర్ ప్రిన్సిపాల్ వి.వి. రామిరెడ్డి మాట్లాడుతూ – ఇంజనీరింగు చదివి, సివిల్ సర్వీస్ కు ఎంపికైన జిల్లా ఎస్పీ దీపిక , సివిల్స్ వ్రాయాలని ఆసక్తి కలిగిన తమ కళాశాల విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచా
రన్నారు. తాము కోరిన వెంటనే తమ కళాశాల విద్యార్థులకు రహదారి భద్రత పట్ల అవగాహన కల్పించేందుకు పోలీసు
అధికారులు ముందుకు రావడం అభినందనీయమని, కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో లెండీ ఇంజనీరింగ్ కళాశాల ఫౌండర్ ప్రిన్సిపాల్ డా. వి.వి. రామిరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డా.హరిబాబు, భోగాపురం సిఐ విజయనాధ్, డెంకాడ ఎస్ఐ యు.మహేష్, కళాశాలఫెమీనా సభ్యులు డా. జానకి, డా. పి.డి.శైలజ, కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

జర్నలిస్టులను ఆదుకోవాలి

Murali Krishna

పంట మార్పిడిపై రైతులతో చర్చ

Satyam NEWS

నిరుపేద విద్యార్థికి శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ (రాజుపేట) సహాయం

Bhavani

Leave a Comment