41.2 C
Hyderabad
May 4, 2024 17: 28 PM
Slider రంగారెడ్డి

కెసిఆర్ పాలనలో తెలంగాణ రైతులు దగా పడ్డారు

#kagitivijayakumarreddy

కెసిఆర్ పాలనలో తెలంగాణ రైతులు దగా పడ్డారని కాగితి విజయకుమార్ రెడ్డి పేర్కొన్నారు.  నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాగితి విజయకుమార్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో కెసిఆర్ పాలనలో తెలంగాణ రైతులు దగా పడ్డారని  పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ రాష్ట్ర సాధనకై కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి వర్ణనాతీతమని కొనియాడారు. ఏఐసిసి పి సి సి పిలుపుమేరకు హాత్సే హాత్ కార్యక్రమం  గురువారం జనవరి 26  నుండి మార్చి 26 వరకు కల్వకుర్తి పట్టణంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రజల ఆకాంక్షలు అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చారని, కెసిఆర్ కుటుంబ పాలన కోసం వారి అధికార దాహం తీర్చడానికి కాదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వ్యవసాయానికి పూర్వ వైభవం తేవాలని ఉద్దేశంతో, రైతుల జీవితాలలో వెలుగు నింపేందుకే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏకకాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ ఇందిరమ్మ రైతు భరోసా పథకం భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 12 వేల చొప్పున అన్ని పంటలకు గిట్టుబాటు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. అదేవిధంగా మూతపడిన చక్కెర కర్మ గార్లను నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు.

పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందేలా పటిష్టమైన పంట బీమా పథకం రైతు కూలీలు కవులు రైతులకు రైతు బీమా పథకం వర్తింపు చేస్తామని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం వ్యవసాయానికి అనుసంధానం చేయనున్నట్లు ధరణి పోర్టల్ రద్దు చేస్తామన్నారు.

ధరణి స్థానంలో అందరి భూములకు రక్షణ కల్పించేలా సరికొత్త రెవెన్యూ వ్యవస్థ పోడు భూముల రైతులకు అసైన్ భూముల లబ్ధిదారులకు క్రయవిక్రాలతో సహా అన్ని యజమాని హక్కులు కల్పిస్తామన్నారు. నకిలీ విత్తనాలు పురుగుమందుల విక్రయదారులపై ఉక్కు పాదం వారి ఆస్తులు జప్తు చేసి రైతులకు నష్టపరిహారం ఇచ్చేలా చూస్తూ బాధ్యులపై పిడి యాక్ట్ కేసులతో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నిర్దిష్ట సమయ ప్రణాళికతో అవినీతిరహితంగా పెండింగ్ ప్రాజెక్టును పూర్తిచేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని రైతు కమిషన్ రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చట్టబద్ధమైన అధికారులతో ఏర్పాటు చేస్తామని లాభసాటి వ్యవసాయమే లక్ష్యంగా తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నూతన వ్యవసాయ విధానం పంటల ప్రణాళిక, రైతును రాజును చేయడమే  కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశమని దేశానికి రైతును రాజును చేయడం రాహుల్ గాంధీకే  సాధ్యమని పేర్కొన్నారు.

హాత్ సే హాత్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ ఎస్ యు ఐ ఎస్ సి ఎస్ టి బి సి మైనార్టీ కిసాన్ సెల్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు ప్రజలు అధికల పాల్గొనాలని ఈ కార్యక్రమంలో విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Related posts

బయోమెట్రిక్ తప్పనిసరి

Murali Krishna

కార్తీక మాసంలో విష్ణుస్మ‌రణ అత్యంత ఫ‌ల‌దాయకం

Satyam NEWS

డ్రైనేజి పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment