32.2 C
Hyderabad
May 21, 2024 13: 53 PM
Slider ఖమ్మం

59జి ఓ ను సద్వినియోగం చేసుకోవాలి

#Collector V.P

ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఏర్పరచుకున్న వారికి జీవో 59 ద్వారా ప్రభుత్వం చేపట్టిన క్రమబద్ధీకరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ అన్నారు. కలెక్టర్ ఖమ్మం నగరంలోని 55వ డివిజన్ వేణుగోపాల్ నగర్-1, 4వ డివిజన్ యూపీహెచ్ కాలని, వేణుగోపాల్ నగర్-2 లలో పర్యటించి జీవో 59 దరఖాస్తుదారులకు డిమాండ్ చెల్లింపుపై అవగాహన కల్పించారు. క్రమబద్ధీకరణ తో చేకూరే ప్రయోజనాల గురించి వారికి వివరించారు.

ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని కోల్పోతే నష్టపోతారని వారికి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీవో 59 క్రింద ఆమోదించిన దరఖాస్తుదారులకు క్రమబద్ధీకరణ చేసి, పట్టాలు జారికిగాను ప్రభుత్వ కనీస భూ ధర చెల్లింపుకు డిమాండ్‌ జారిచేయుట జరిగినదని ఆయన అన్నారు. డిమాండ్‌ మేరకు చెల్లింపులు చేసి, ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

చెల్లింపులు చేసిన వారికి క్రమబద్ధీకరణ చేసి, పట్టాల జారిచేయుట జరుగుతుందన్నారు. క్రమబద్ధీకరణతో సర్వ హక్కులు వస్తాయన్నారు. బ్యాంకర్లు నిర్మాణాలు తదితర అవసరాలకు ఋణాలు అందజేస్తారన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సంబంధిత తహసీల్దార్‌, మునిసిపల్‌ కమిషనర్లు సంయుక్తంగా క్షేత్ర సందర్శన చేయాలని, డిమాండ్‌ వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

అనధికారికంగా ప్రభుత్వ స్థలాల్లో ఉంటున్న వారికి ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిందని ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే క్రమబద్దీకరణ చేసుకోవాలన్నారు. డిమాండ్‌ చెల్లించకుండా అనధికారికంగా ప్రభుత్వ స్థలాల్లో ఉన్న వారిపై తగు చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం 20వ డివిజన్ రామచంద్రయ్య నగర్ లో జీవో 58 ద్వారా అందిన దరఖాస్తుల క్షేత్ర తనిఖీ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు.

ఇంటింటికి వెళ్లి, ఎంతకాలం నుండి ఉంటున్నది, ఇది వరకు ఎక్కడ ఉన్నది, చేస్తున్న వృత్తి గురించి ఆరాతీసి, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డులు, రేషన్ కార్డు తదితరాలను పరిశీలించారు. నిర్మాణాలు ఎప్పుడు చేసింది, ఎంతకాలం నుండి ఉంటున్నది, దానికి సంబంధించి ఆధారాలు సేకరించాలని, తనిఖీ ప్రక్రియ పూర్తి పారదర్శకతతో పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు.

Related posts

ప్రజావాణి సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు

Satyam NEWS

భారత స్పేస్ పరిశోధనల్లో ప్రైవేటు భాగస్వామ్యం

Sub Editor

ఈ రెండేళ్లలో 70 వేల మంది సైనికులకు కరోనా

Sub Editor

Leave a Comment